Anasuya Bharadwaj : అలా చేద్దామంటోన్న యాంకర్.. విశాఖపై అనసూయ ప్రేమ
Anasuya Bharadwaj : యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో ఎంత సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. అందులోనూ అనసూయపై జరిగే ట్రోలింగ్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఎంత ట్రోలింగ్ జరిగినా, ఎన్ని రకాలుగా కామెంట్లు వచ్చినా కూడా అనసూయ అలాంటి వాటిని పట్టించుకోదు. ట్రోలింగ్‌కు బాధపడటం ఎప్పుడో మానేసిన అనసూయ… ఇప్పుడు అంతే ఘాటుగా ధీటుగా సమాధానాలు ఇస్తోంది.

Anasuya Bharadwaj about Vizag
అయితే అనసూయ మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ హడావిడి చేస్తూనే ఉంటుంది. అందాల ఆరబోతతో, ఏదో ఒక విషయంలోస్పందిస్తూనో.. సమాజంలోని కొన్ని విషయాలు, దుర్ఘటనలపై స్పందిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు అనసూయ చేసే కామెంట్లు ఆలోచించేలా ఉన్నా కూడా ఎక్కువగా ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటుంది. ఈ మధ్యే కరోనా సోకడంతో అనసూయ క్వారంటైన్‌కు పరిమితమైంది. మళ్లీ ఇప్పుడు నెగెటివ్ రావడంతో యథావిథిగా తన పనులు కానిచ్చేస్తోంది.
అనసూయకు విశాఖ నగరం మీద ప్రేమ : Anasuya Bharadwaj
అయితే తాజాగా అనసూయకు విశాఖ నగరం మీద ప్రేమ పుట్టుకొచ్చింది. స్వచ్చ సర్వేక్షణ్ సర్వేలు ప్రతీ ఏడాది జరుగుతూనే ఉంటుందన్న సంగతితెలిసిందే. స్వచ్చత, పరిశుభ్రతలో వైజాగ్ సిటికి నెంబర్ వన్ స్టానం వచ్చిందట. ఇదే విషయాన్ని అనసూయ చెప్పుకొచ్చింది. ఈ మేరకు అనసూయ ఓ పోస్ట్ చేసింది.. స్వచ్చ్ సర్వేక్షన్‌లో విశాఖని దేశంలో నెంబర్ వన్‌గా నిలిపినందుకు జీవిఎంసీ కమిషనర్‌గా సృజన గారికి సహకరిద్దాం.. మన విశాఖ క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉంచుదామని కోరింది.

Anasuya Bharadwaj about Vizag