Anasuya Bharadwaj : అనసూయ వింత గెటప్పు… కొత్త లుక్‌పై నెట్టింట్లోట్రోల్స్
Anasuya Bharadwaj అనసూయ Anasuya Bharadwaj వేసే వింత వింత గెటప్పులు నెట్టింట్లో ఎప్పుడూ కూడా వివాదాలకు దారి తీస్తూనే ఉంటాయి. జబర్దస్త్ షో కోసం ఆమె వేసే దుస్తులు, రెడీ అయ్యే విధానం అన్నీ కూడా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. అయితే తాజాగా అనసూయ తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త లుక్కును బయటకు వదిలింది. బాలీవుడ్ ఎంట్రీ కోసం ఇన్నాళ్లు ప్రయత్నించిన అనసూయకు ఆ టైం వచ్చేసింది. తాను బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోన్నట్టు ప్రకటించేసింది.
అనసూయను ఆడుకుంటున్న నెటిజన్లు Anasuya Bharadwaj
అసలే ఇప్పుడు అనసూయ అన్ని భాషల్లో చిత్రాలను చేస్తూ బిజీగా ఉంది. మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ దుమ్ములేపుతోంది. తన కొత్త ప్రాజెక్ట్ మిస్ సీ అంటూ ప్రకటించింది. ఈ రోజు నాది.. గౌరి నాయుడు కొత్త ఫ్రెండ్‌ను మీకు పరిచయం చేస్తున్నా. మిస్ సీ. ప్రస్తుతం నడుస్తున్న ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించిన క్యారెక్టర్ అది. ఇక ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ఏమీ చెప్పలేను. కానీ ఆ పాత్రను ఇలా డిజైన్ చేసేందుకు నేను, గౌరి ఎంతో కష్టపడ్డాను. దీన్ని క్రియేట్ చేసినందుకు ఎంతో గర్వపడుతున్నాం.
కష్టసుఖాల్లో తోడున్నాం. వృత్తి పరంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నాం. ఎంతో మంది నటీనటులు సెట్ మీద లుక్స్‌ను కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాం.. ఇకపై మరో అద్భుతైన పాత్ర, లుక్ కాబోతోంది అని చెప్పుకొచ్చింది. ఇక ఆ లుక్కుపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. పశువులు కంట్రోల్ లో ఉండడానికి ముక్కుకి తాడు కడతారు నీకు పశువుకి తేడ లేదనిపించింది, మాఫియా అనుకుంటా అని కామెంట్లు పెడుతున్నారు.