Anasuya : మిమ్మల్ని ఇంకా చాలా అడగాలి.. బన్నీ ముందు అనసూయ కోరికల చిట్టా
Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా ఉన్న అనసూయ.. వెండితెరపై మాత్రం నటిగా దుమ్ములేపేస్తుంటుంది. ఓ పాత్రను అనసూయ ఒప్పుకుందంటే అందులోకి పరాకాయ ప్రవేశం చేస్తుందంతే. అలా క్షణం, రంగస్థలం సినిమాలతో అనసూయ తన సత్తా ఏంటో చాటేసింది. ఇక ఇప్పుడు దాక్షాయణిగా అనసూయ అందరినీ భయపెట్టేందుకు రెడీ అయింది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది.
అందులో అనసూయ మాట్లాడిన మాటలు ఇంకా వైరల్ అవుతున్నాయి. అసలు ముందుగా అనసూయకు పుష్ప సినిమాలో పాత్రనే లేదు. చావు కబురు చల్లగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనసూయ స్టేజ్ మీద నుంచి సుకుమార్‌ను బెదిరించింది. అల్లు అర్జున్‌ను వేడుకుంది. నీతో ఒక్క సినిమా అయినా చేయాలని ఉందంటూ అందరి ముందే బన్నీని అనసూయ అడిగేసింది.

Anasuya Bharadwaj On Allu Arjun Giving Chance In Pushpa
Anasuya : దాక్షాయణి పాత్రపై అనసూయ..
ఇదే విషయాన్ని అనసూయ తాజాగా మళ్లీ గుర్తు చేసింది. అలా ఆ రోజు అడిగానో లేదో.. వారం రోజుల్లో కాల్ వచ్చింది. ఇలా అన్నీ జరుగుతాయంటే.. మిమ్మల్ని నేను ఇంకా ఎన్నో అడగాలి. సినిమాల పరంగా అంటూ అనసూయ కామెంట్లు చేసింది. అంటే బన్నీతో ఇంకా సినిమాలు చేయాలనే కోరికను అలా అనసూయ బయట పెట్టేసింది. మొత్తానికి దాక్షాయణి పాత్రతో అనసూయ మాత్రం సర్ ప్రైజ్ ఇస్తుందట.