Anasuya Bharadwaj : కోలీవుడ్ ఎంట్రీ.. లంగావోణిలో అనసూయ అదుర్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya Bharadwaj : కోలీవుడ్ ఎంట్రీ.. లంగావోణిలో అనసూయ అదుర్స్

 Authored By bkalyan | The Telugu News | Updated on :2 September 2021,5:10 pm

Anasuya Bharadwaj : యాంకర్‌గానే కాకుండా అనసూయ తనలోని నటిని కూడా అందరికీ పరిచయం చేసింది. బుల్లితెరపై ఆమె చేసే రచ్చకు ఎక్కువగా నెగెటివిటీ వస్తే.. వెండితెరపై ఆమె నటనకు ఎంతో మంది ఫిదా అయ్యారు. అలా బుల్లితెరపై బుల్లి బట్టల్లో అందాలను ఆరబోసే అనసూయ.. వెండితెరపై మాత్రం నటనకు ప్రాధాన్యమున్న సినిమాలను చేస్తూ వస్తోంది. ఇక స్పెషల్ సాంగ్స్ చేసినా కూడా హద్దుల్లోనే ఉంటుంది. ఎప్పుడూ కూడా సిల్వర్ స్క్రీన్ మీద అందాలను ఆరబోయలేదు.

Anasuya Bharadwaj On Kollywood Entry

Anasuya Bharadwaj On Kollywood Entry

ఇప్పుడు అనసూయ వెండితెర మీద ఫుల్ బిజీగా ఉండబోతోంది. తమిళ, తెలుగు, మళయాల సినిమాలతో అనసూయ తన సత్తా చాటబోతోంది. ఓటీటీల్లోనూ అనసూయ కనిపించే అవకాశాలున్నాయి. వెబ్ సిరీస్‌లతో అనసూయ దేశ వ్యాప్తంగా రచ్చ చేయబోతోన్నట్టు టాక్. బాలీవుడ్ వాళ్లు కూడా అనసూయను కొన్ని ప్రాజెక్ట్‌ల కోసంఅప్రోచ్ అయినట్టు ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే అనసూయ కోలీవుడ్ ఎంట్రీపై ఆ మధ్య ఎన్నో రకాల వార్తలు వచ్చాయి.

Anasuya Bharadwaj On Kollywood Entry

Anasuya Bharadwaj On Kollywood Entry

చెన్నైలో ఆ మధ్య అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. విజయ్ సేతుపతిని కలిసింది. అక్కడి సెట్‌లో సందడిచేసింది. సిల్క్ స్మిత బయోపిక్ అంటూ కొన్ని రోజులు రూమర్లు బాగానే వచ్చాయి. అయితే వాటిని అనసూయ ఖండించేసింది. తాజాగా అనసూయ తన కోలీవుడ్ ఎంట్రీపై నోరు విప్పింది. తాను జబర్దస్త్ కోసం లంగావోణిని ధరించి ఫోటో షూట్ చేసుకుంటోంది అనసూయ. అది గౌరి నాయుడు తయారు చేసిందని, కోలీవుడ్ ఎంట్రీ కోసం రెడీ చేసిందని అసలు విషయం చెప్పేసింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది