Anasuya : లిఫ్ట్‌లో అనసూయ ఆర్తనాదాలు.. అదిరిపోయిన ట్రైలర్
Anasuya : బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై మంచి నటిగా అనసూయ అందరినీ ఆకట్టుకుంది. బుల్లితెరపై అనసూయ గ్లామర్ డాల్‌నే పేరుంటే.. వెండితెరపై మంచి నటి అనే క్రేజ్‌ను తెచ్చుకుంది. అలా అనసూయ సెలెక్ట్ చేసకునే పాత్రలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలా అనసూయ ఇప్పుడు మరోసారి తన నటనతో అందరినీ కట్టిపడేసేందుకు ఓ ప్రయోగాత్మక పాత్రతో రాబోతోంది.

Anasuya Thankyou Brother Trailer Goes viral
అనసూయ సినిమా మొత్తం గర్భవతి కనిపిస్తోంది. థ్యాంక్యూ బ్రదర్ అనే ఈ సినిమాలో అనసూయ సాహసోపేతమైన పాత్రే చేస్తోంది. డీ గ్లామర్ రోల్ అయినా కూడా నటనకుస్కోప్ ఉండటంతో ఓకే చెప్పినట్టుంది. ఇప్పటికే పోస్టర్లు, మోషన్ పోస్టర్లతో థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమా అందరి దృష్టిలో పడింది. అలా అనసూయ గర్భవతిగా నటిస్తోందనే విషయం బయటకు రావడంతోనే వార్తలు వైరల్ అయ్యాయి. ఇక సినిమా మొత్తం అలానే కనిపించనుందని, కేవలం లిఫ్ట్‌లోనే ఉంటుందని తెలిసినప్పటి నుంచి అందరికీ అంచనాలు పెరిగాయి.
వాటికి తగ్గట్టుగా తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ కూడా మరింత ఆసక్తిని పెంచేస్తోంది. లాక్డౌన్ సమయం అవ్వడం.. పైగా నిండు గర్భిణి కావడం.. ఆ సమయంలో లిఫ్ట్‌లో ఇరుక్కోవడం.. తనతో పాటు అందులో ఓ కుర్రాడు మాత్రమే ఉండటం.. ఇలా నెలలు నిండటం, ప్రసవం జరగడం లాంటి ఒళ్లు గగుర్పొడిచే ఎన్నో విషయాలున్నట్టు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అనసూయ తన బాధను భరించలేక పెట్టే ఆర్తనాదాలు అందరినీ టచ్ చేసేలా కనిపిస్తున్నాయి. ఈ ట్రైలర్‌ను వెంకటేష్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది.
