Ravi – Lasya : యాంకర్ రవి – లాస్య టంగ్ స్లిప్పయి టాప్ సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేశారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ravi – Lasya : యాంకర్ రవి – లాస్య టంగ్ స్లిప్పయి టాప్ సీక్రెట్స్ అన్నీ బయట పెట్టేశారు

 Authored By govind | The Telugu News | Updated on :9 August 2021,5:40 pm

Ravi – Lasya : ఇండస్ట్రీలో గానీ, బయటగానీ దాగాల్సిన, బయట పడకుండా ఉండాల్సిన కొన్ని రహస్యాలు పొరపాటునో తొందరపాటు వల్లనో నోరు జారుతుంటారు. అసలూ చెప్పకూడదనే విషయాలను ఎంత దాచుకోవాలనుకున్నా కొన్ని సందర్భాలలో తెలియకుండానే పొరపాటున అలా బయట పడిపోతుంటాయి. అలాంటి చిన్న పొరపాటే ఇప్పుడు యాంకర్ లాస్య కూడా చేసింది. ఇన్ని రోజులు యాంకర్ రవి దాచుకున్న సీక్రేట్‌ను ఈమె గుట్టు విప్పేసింది. అందరూ చూస్తుండగానే రవికి సంబంధించిన టాప్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేసింది లాస్య.

anchor ravi lasya revealed top secrets

anchor ravi-lasya-revealed top secrets

బుల్లితెర మీద రవి – లాస్య లకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య పదేళ్లకు పైగానే మంచి అనుబంధం ఉండటమే అందుకు కారణం. కానీ కొన్ని విషయాలలో ఎంత స్నేహితులు అయినా కూడా మనస్పర్ధలు, గొడవలు రాకుండా ఉండవు. వీరిద్దరి మధ్య కూడా కొన్నేళ్లు అలాగే గొడవలు వచ్చాయి. దాంతో మాట్లాడుకోవడం మానేసారు. కనీసం కలవలేదు..ఒకరిని ఒకరు చూసుకోలేదు. ఈ గ్యాప్‌లో మరో పాపులర్ యాంకర్ శ్రీముఖితో కలిసి రవి కొన్నేళ్ల పాటు కలిసి ప్రోగ్రామ్స్ చేసాడు.

Ravi – Lasya : రవి బిగ్ బాస్ సీక్రేట్ బయటపెట్టింది లాస్య.

ప్రస్తుతం శ్రీముఖితో విడిపోయిన రవి మళ్లీ లాస్యతో కలిసిపోయాడు. 5 – 6 నెలలుగా రవి – లాస్య కలిసి ఈవెంట్స్, షోలు చేస్తున్నారు. రవి – లాస్య కలిసిపోయిన తర్వాత వీరికి మళ్ళీ డిమాండ్ బాగానే పెరిగింది. ఈవెంట్స్‌తో పాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనూ భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘కనబడుట లేదు’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రవి, లాస్య హోస్ట్ గా వ్యవహరించారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, విజయేంద్ర ప్రసాద్ సహా పలువురు సినీ పెద్దలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘కనబడుట లేదు’ అనే పదాన్ని ఎక్కువసార్లు రవి, లాస్య వాడారు. ఈ క్రమంలోనే రవి బిగ్ బాస్ సీక్రేట్ బయటపెట్టింది లాస్య. యాంకర్ రవి బిగ్ బాస్ షోకు వెళ్ళనున్నాడనే వార్తలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అయితే తాజాగా నిర్వహించిన ‘కనబడుట లేదు’ ఈవెంట్‌లో.. కొన్ని రోజుల్లో నువ్వు కూడా కనిపించకుండా పోతావట కదా.. ఏదో హౌజ్‌లోకి వెళ్తున్నావట కదా.. అంటూ రవి బిగ్ బాస్ కి వెళుతున్న సీక్రేట్ గురించి చెప్పేసింది లాస్య.

ఇది కూడా చ‌ద‌వండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> సుడిగాలి సుధీర్‌ను మావ‌య్య అని పిలిచిన ర‌ష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థ‌మేమిటో..?

ఇది కూడా చ‌ద‌వండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైర‌ల్ ఫిక్స్‌ !

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది