Anchor Suma : శ్రీరామ నవమి స్పెషల్.. ఆకట్టుకుంటోన్న సుమ రాజీవ్ కనకాల
Anchor Suma : సుమ రాజీవ్ కనకాల మీద లెక్కలేనన్ని రూమర్లు పుట్టుకొస్తుంటాయి. ఈ ఇద్దరి పర్సనల్ లైఫ్ మీద ఎప్పుడూ ఏదో ఒక కథనం బయటకు వస్తూనే ఉంటుంది. సుమ రాజీవ్ కనకాల దాంపత్య జీవితం సవ్యంగా లేదంటూ టాక్ వినిపిస్తుంటుంది. అయితే ఈ ఇద్దరూ మాత్రం వాటిని పరోక్షంగా ఖండిస్తూ ఉంటారు. సందర్బం వచ్చినప్పుడు మాత్రం నేరుగా రూమర్లను కొట్టిపారేస్తుంటారు.సుమ రాజీవ్ కనకాల ఎప్పుడో విడిపోయారు.. అందుకే వేర్వేరుగా ఉంటున్నారు..
సుమ వేరే ఇంట్లో ఉంటుండగా.. రాజీవ్ కనకాల వేరే చోట ఉంటున్నాడంటూ ఆ మధ్య కథనాలు వచ్చాయి. కరోనా లాక్డౌన్ సమయంలోనూ సుమ ఇంట్లో ఉంటూ కొన్ని వీడియోలు చేసింది. అక్కడా కూడా రాజీవ్ కనిపించలేదు. అయితే రాజీవ్ కనకాల ఓ సారి లైవ్‌లోకి వచ్చాడు. ఆ సందర్భంలో సుమ కూడా కనిపించింది.భార్యాభర్తలన్నాక ఏవో చిన్నపాటి గొడవలుంటాయ్.. కానీ మీడియా అనుకున్నట్టుగా, రాసినట్టుగా అలాంటివేమీ లేవు.. మేం కలిసి ఉన్నామంటూ ఆ మధ్య రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చేశాడు. ఇక సుమ కూడా పరోక్షంగా వీటిపై స్పందిస్తుంటుంది.

Anchor Suma And Rajeev Kanakala Sri rama navami Special Pics
భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, వెకేషన్లకు వెళ్లిన ఫోటోలను సుమ షేర్ చేస్తూ.. రూమర్లకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తుంటుంది.తాజాగా శ్రీరామ నవమి సందర్భంగా సుమ షేర్ చేసిన ఫోటోలు కూడా అలాంటివే. ఈ ఇద్దరూ కలిసి సంప్రదాయ దుస్తుల్లో అలా కనిపించే సరికి చూసే వారికి కడుపు నిండిపోయేలా ఉంది. మొత్తానికి ఈ జంట మాత్రం ఇలా పండుగ నాడు చూడ ముచ్చటగా ఉంది. నెటిజన్లు సైతం ఈ ఇద్దరిని ఇలా చూసి సంబరపడిపోతోన్నారు.