Anchor Suma : వారి గుట్టు తెలుసుకునేందుకు ప్లాన్.. సుమ మామూల్ది కాదుగా!
Anchor Suma : యాంకర్‌గా సుమకు సాటి లేదు.. ఇకపై రారు కూడా. గత కొన్నేళ్లుగా సుమను ఢీ కొట్ట లేక ఎంతో మంది సైడ్ అయిపోయారు. కొందరు సుమను ఢీ కొట్టేందుకు గ్లామర్, అందాలతో వల వేశారు. కానీ అవేమీ కుదరలేదు. మొత్తానికి సుమ ముందు గులాం అనాల్సి వచ్చింది. ఇప్పటికీ ఎప్పటికీ ఆమెకు నెంబర్ వన్ స్థానాన్ని ఇచ్చి మిగతా వారు పోటీ పడటం ప్రారంభించేశారు. అందుకే సుమతో ఎవ్వరూ కూడా పోల్చుకోరు.

Anchor Suma Funny video goes viral
తెరపై కనిపించే షోలు అయినా లైవ్ షోలు అయినా సరే సుమ హ్యాండిల్ చేస్తే అది సక్సెస్ అన్నమాట. ఇకపెద్ద హీరోల సినిమా ఫంక్షన్లు, సక్సెస్ ఈవెంట్లు అయితే కచ్చితంగా సుమ హోస్ట్ చేయాల్సిందే. అలా అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా స్పాంటేనియస్‌గా పంచ్‌లు వేసే సుమకు.. డైరెక్షన్ టీం, వారి సలహాలు, ప్రాంప్ట్‌లు ఏమీ అవసరం ఉండవు. అందుకే సుమ ఇన్ పుట్ కోసం ఇచ్చే మైక్‌ను ధరించదు.
సుమ మామూల్ది కాదుగా
కానీ తాజాగా ఆమె అలాంటి మైక్‌ను ధరించిందింట. డైరెక్షన్ టీం ఎప్పుడూ ఏదో గుసగుసలు పెడుతూ ఉంటుందట. వాటి సంగతేంటో.. ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని అలా మైక్ పెట్టుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. అలా వారి గుట్టును బయటకు లాగేందుకు సుమ ఇలా ప్లాన్ వేసిందన్న మాట. ఈ మేరకు సుమ మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram