Anchor Suma : ఈ ఒక్క వీడియోతో యాంకర్ సుమ రాజీవ్ మధ్య విబేధాలకి క్లారిటీ వచ్చినట్టే..!
Anchor Suma : సుమ.. జస్ట్ యాంకర్ కాని హీరోయిన్స్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేరళకి చెందిన సుమ నటి కావాలని పాతికేళ్ళ క్రితం బయలు దేరింది. వెండితెరపై అంతగా వెలగలేదు. కానీ, వందలాది చిత్రాలు వెండితరపై వెలగబోయేముందు జరిగే ఉత్సవాలలో మాత్రం సుమ గాత్రం విజయనాదం చేస్తూనే ఉంది. ఇక బుల్లితెరపై సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సాగుతున్న అనేక కార్యక్రమాలు జనాన్ని విశేషంగా అలరిస్తున్నాయి. సుమకు ముందు కూడా పలువురు యాంకరింగ్ లో మేటి అనిపించుకున్నా, సుమ తరువాతనే ఎవరైనా అనిపించేలా సుమ ఎదిగింది.
పాచవిటల్ సుమ 1974 మార్చి 22న కేరళలో జన్మించారు. సుమ తెలుగునాట పుట్టకపోయినా, తెలుగుభాషపై ఆమె పట్టును చూస్తే ముక్కున వేలేసుకోక మానరు. ఎంతోమంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చిన లక్ష్మి, దేవదాసు కనకాల వద్ద సుమ కూడా శిక్షణ తీసుకున్నారు. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో తొలిసారి సుమ వెండితెరపై నాయికగా కనిపించారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో సుమ భలేగా మురిపించారు. లక్ష్మి, దేవదాస్ కనకాల దంపతుల తనయుడు రాజీవ్ ను ప్రేమించి పెళ్ళాడారు సుమ. అప్పటి నుండి యాంకర్‌గా రాణిస్తుంది సుమ.

Anchor Suma gives clarity with this Video
Anchor Suma : ఇలా క్లారిటీ వచ్చింది..
సుమ, రాజీవ్ దంపతుల తనయుడు రోహన్ కూడా తాత,తండ్రి, తల్లి బాటలో నటనలో రాణించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం రోహన్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. తప్పకుండా రోహన్ ‘కనకాల నటకుటుంబం మూడో తరం’ పేరు నిలుపుతాడని తల్లి సుమ, తండ్రి రాజీవ్ ఆశిస్తున్నారు. ఇక ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమాలో సుమ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సుమ- రాజీవ్ మధ్య విబేధాలు ఉన్నట్టు ఎప్పుడు ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. ఓ సారి రాజీవ్ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా సుమ తన బర్త్ డే వీడియోని షేర్ చేస్తూ తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. ఫ్యామిలీ అందరు ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ సంతోషంగా ఉన్నారు.
View this post on Instagram