Anupama : వామ్మో ఇదెప్పుడు జరిగింది.. అనుపమ పరమేశ్వరన్ ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్ !

Advertisement

Anupama : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. యూత్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లలో ఒకరు అనుపమ. నితిన్ నటించిన ‘ అఆ ‘ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులోకి యాడ్ అయింది. తన అందంతో ప్రేక్షకులను మెప్పించిన అనుపమ టాలీవుడ్ లో అంతగా అవకాశాలు అందుకోవడంలేదని అనిపిస్తోంది. నిఖిల్ నటించిన ‘ కార్తికేయ 2 ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement
Anupama Parameswaran engagement pics viral
Anupama Parameswaran engagement pics viral

ఆ తర్వాత మరే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. సినిమాలపరంగా అనుపమ కెరీర్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే అనుపమ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అనుపమ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఆమె పెళ్లి బట్టలు వేసుకుని ఉంది. దీంతో ఆమెకి పెళ్లయిందా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇన్నాళ్లు సింగిల్ గా ఉన్న నువ్వు రాత్రికి రాత్రి ఎవరితో ఎంగేజ్మెంట్ చేసుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

అనుపమ తన చేతికి ఓ ప్లాస్టిక్ కవర్ ను రింగులా చేసిన ఉంగరాన్ని ధరిస్తూ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది. దీంతో కామెడీగా పోస్ట్ చేసిందని అర్థం అయిపోయింది. అయితే అనుపమ ఎందుకిలా పోస్ట్ చేసింది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. పొరపాటున తన పెళ్లి విషయాన్ని చెప్పడానికే ఇలా చేస్తుందా లేక జనాలను పిచ్చివాళ్లను చేయడానికి ఇలా ఆటాడిస్తుందా అని అంటున్నారు. నిజంగానే అనుపమకి పెళ్లి కుదిరిందా ఎంగేజ్మెంట్ అయిందా అని జనాలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అనుపమ సోషల్ మీడియాలో పెట్టిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.

Advertisement
Advertisement