Anupama : అనుపమ పరమేశ్వరన్ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anupama : అనుపమ పరమేశ్వరన్ ఇంత దారుణమైన నిర్ణయం తీసుకోవడం వెనక కారణం ఏంటి ?

 Authored By sekhar | The Telugu News | Updated on :24 April 2023,1:00 pm

Anupama : “అఆ” సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అందరికీ సుపరిచితురాలే. తన నటనతో అదిరిపోయే స్మైల్ తో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. “రౌడీ బాయ్స్” సినిమాలో అదిరిపోయే నటనతో తిరుగులేని యాక్టర్ అనిపించుకుంది. ఈ సినిమా సక్సెస్ తో అనుపమ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత “కార్తికేయ 2” పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించటంతో…. నేషనల్ వైడ్ అందరి దృష్టిని ఆకర్షించింది.

Anupama Parameswaran such a terrible decision

Anupama Parameswaran such a terrible decision

18 పేజీస్ రూపంలో మరో సక్సెస్ బ్యాక్ టు బ్యాక్ అందుకోవడం జరిగింది. ఈ రీతిగా గత కొద్ది సంవత్సరాల నుండి వరుస పెట్టి విజయాలు అందుకుంటున్న అనుపమ పరమేశ్వరన్ చాలామంది దర్శకులకు నిర్మాతలకు హీరోయిన్ అయిపోయింది. ఓకే చెబుతున్న ప్రతి ప్రాజెక్టు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తూ ఉండటంతో.. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడి ఓరియంటెడ్ సినిమాలకు కూడా సంతకాలు చేస్తూ ఉంది. ఇక ఇదే సమయంలో ఓటిటి కంటెంట్ పై కూడా సీరియస్ దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి పాత్రలైనా చేయడానికి ఈ మధ్య అనుపమ రెడీ అయిపోతోంది. ఈ రీతిగా నిర్ణయాలు తీసుకోవటానికి బలమైన కారణం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూలో చెప్పింది ఏమిటంటే…

Anupama Parameswaran such a terrible decision

Anupama Parameswaran such a terrible decision

గతంలో ఏదైనా పాత్ర ఒప్పుకోవాలి అంటే చాలా భయపడే పరిస్థితి ఉండేది. నన్ను ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారని ప్రశ్నలు మదిలో ఎంతగానో ఉక్కిరిబిక్కిరి చేసేవి. కానీ 2021 లో “ఫ్రీడం మిడ్ నైట్” అనే లఘు చిత్రం చేసాక… ప్రేక్షకుల ఆదరించిన తీరు చూసి నా ఆలోచన విధానం పూర్తిగా మారింది. మనసుకు నచ్చిన పాత్ర చేస్తే ప్రేక్షకులు ఎలాగైనా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం కలిగింది. అంతేకాదు అప్పటినుంచి నా ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించి ప్రతి కొత్త సినిమాతో నా గత ఇమేజ్ నీ పూర్తిగా చెరిపేసి.. ముందుకు వెళ్లాలని. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలు చేసుకుంటూ… దేనికైనా సై అనటానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు.. చాలెంజింగ్ పాత్రలు చేస్తున్నట్లు అనుపమ పరమేశ్వరన్ స్పష్టం చేయడం జరిగింది.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది