Anushka Sharma : యోగా ఆసనాలతో నెటిజన్లను ఫిదా చేస్తున్న అనుష్క శర్మ
Anushka Sharma: ఈ మధ్యకాలంలో యోగాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరిగింది. రాజకీయ నేతలు, క్రీడాకారులు, నటులు, సీఈవోలు.. ఇలా విభిన్న రంగాలకు చెందిన వ్యక్తులు యోగా చేస్తున్నారు. యోగా వాళ్లకు ఏ విధంగా ఉపయోగపడిందో చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రధాని మోడీ సైతం యోగా చేసి దేశవ్యాప్తంగా పిలుపునిస్తారు. జూన్ 21 వరల్డ్ యోగా డే సందర్భంగా ఎంతో మంది సెలబ్రెటీలు యోగా చేస్తూ ఆకట్టుకున్నారు.
పలు యోగాసనాల్లో ఫోజులిస్తూ ఆకట్టుకున్నారు. యోగా ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ.. సెలబ్రిటీలు యోగాసనాలు వేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ యోగా ఆసనాలు వేస్తున్న పలు ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. యోగాతో ఉన్న అనుబంధాన్ని ట్యాగ్ చేస్తూ షేర్ చేయగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
కాగా ప్రస్తుతం సినిమాలకంటే కూడా బిజినెస్ పై ఫోకల్ పెట్టి బిజీగా ఉంటోంది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ రంగంలోకి అడుగుపెట్టి పలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. కాగా అనుష్క ఏ మదర్ ఏజ్ అనే చిత్రాన్ని నిర్మించింది. మరోవైపు చక్ దా ఎక్స్ ప్రెస్ సినిమాలో నటిస్తోంది. ఖాలా అనే మరో వెబ్ సిరీస్ ని కూడా నిర్మించింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యామిలీ విషయాలు షేర్ చేసుకుంటోంది. లెటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. అలాగే ఫిట్ నెస్ పై కూడా ఫోకస్ పెట్టింది.