Anushka : న‌న్ను వాడుకోవాలని అనుకున్నారు.. క్యాస్టింగ్ కౌచ్ పై అనుష్క షాకింగ్ కామెంట్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anushka : న‌న్ను వాడుకోవాలని అనుకున్నారు.. క్యాస్టింగ్ కౌచ్ పై అనుష్క షాకింగ్ కామెంట్స్‌..!

 Authored By sandeep | The Telugu News | Updated on :16 February 2022,11:00 am

Anushka : అందాల ముద్దుగుమ్మ అనుష్క సూప‌ర్ సినిమాతో హీరోయిన్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆమె ఒక‌వైపు క‌థానాయిక‌గా న‌టిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లో మెర‌సింది. అనుష్క ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రు అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అయితే అనుష్క చాలా స్లో అండ్ కామ్. ఎలాంటి వివాదాల జోలికి పెద్ద‌గా పోదు. అలానే వివాదాల‌పై కూడా స్పందించ‌డానికి అంత‌గా ఆస‌క్తి చూప‌దు. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ విష‌యంలో అనుష్క సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అంత‌టా చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

ప్ర‌స్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవకాశాలు ఆశచూపి అమ్మాయిలను లొంగదీసుకునే విష సంస్కృతి టాలీవుడ్ లో కూడా ఉంది. కెరీర్ బిగినింగ్ లో నేను కూడా చూశాను. అయితే నేను ప్రతి విషయంలో నిక్కచ్చిగా ఉంటాను. కరెక్ట్ గా మాట్లాడతాను, కాబట్టి ఈ ఇబ్బందులు నాకు ఎదురు కాలేదు. నా మనస్తత్వం తెలిసి, నా దగ్గరకు ఎవరూ ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు అని పేర్కొంది.అన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్ ఉంటుంది.

anushka shetty comments on casting couch

anushka shetty comments on casting couch

Anushka : అనుష్క అలా మాట్లాడేసిందేంటి..!

కాక‌పోతే మ‌నం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉందంటూ అనుష్క ప‌లు కామెంట్స్ చేసింది. ప్ర‌స్తుతం అనుష్క చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి. ఇటీవ‌లి కాలంలో అనుష్క మాదిరిగానే చాలా మంది హీరోయిన్స్ కూడా త‌మ జీవితంలో ఎదుర్కొన్న స‌మస్య‌ల‌పై సంచ‌ల‌న కామెంట్స్ చేస్తున్నారు. అప్ప‌ట్లో కెరీర్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మౌనంగా ఉన్న వారు ఇప్పుడు నిర్భ‌యంగా ఆ నాటి విష‌యాల గురించి చెప్పుకొస్తున్నారు.అరుంధ‌తి సినిమాతో అదుర్స్ అనిపించిన అనుష్క చివ‌రిగా నిశ్శ‌బ్ధం చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది