Anushka Shetty : బంగారం లాంటి అబ్బాయినీ భర్తగా పట్టేసిన అనుష్క..!!

Advertisement

Anushka Shetty : హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు చలనచిత్ర రంగంలో మాత్రమే కాదు దక్షిణాది సినిమా రంగంలో అనేక సినిమాలు చేయడం జరిగింది. మొట్టమొదట సూపర్ సినిమాతో హీరోయిన్ గా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. దక్షిణాది చలనచిత్ర రంగంలో చాలామంది టాప్ హీరోలతో అనుష్క నటించడం జరిగింది. భారతీయ చలనచిత్ర రికార్డులను బ్రేక్ చేసిన “బాహుబలి” సినిమాలో రాణిగా అనుష్క పాత్ర సినిమాకి హైలైట్ గా నిలిచింది.

Advertisement

బాహుబలి తర్వాత అనుష్క ఇప్పటివరకు ఒక హిట్ కూడా అందుకోలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు అనుష్క పెళ్లికి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ స్వీటీకి సంబంధం ఫిక్స్ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. బెంగళూరులో ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
Anushka who took a boy like gold as her husband
Anushka who took a boy like gold as her husband

అయితే గతంలో అనుష్క పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. మరి ఇప్పుడు బెంగుళూరు బిజినెస్ మాన్ తో పెళ్లికి అనుష్క రెడీ అయిన వస్తున్నా వార్తలలో వాస్తవం ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతం అనుష్క నవీన్ పొలిశెట్టితో..”మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమా చేస్తూ ఉంది. సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి సాంగ్స్ ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఉన్నాయి.

Advertisement
Advertisement