Arjun Reddy Racha Movies : అర్జున్ రెడ్డి, రచ్చ మూవీలు ఫస్ట్ చాన్స్ నాకే వచ్చింది..!
ప్రధానాంశాలు:
Arjun Reddy Racha Movies : అర్జున్ రెడ్డి, రచ్చ మూవీలు ఫస్ట్ చాన్స్ నాకే వచ్చింది..!
Arjun Reddy Racha Movies : సినిమాల నుంచి కొంతకాలంగా విరామం తీసుకున్న నటుడు మంచు మనోజ్.. తాజాగా ‘భైరవం’ అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో మనోజ్ తో పాటు నారా రోహిత్, బెల్లం కొండ శ్రీనివాస్ లు కూడా నటించారు. తమిళ హిట్ మూవీ ‘గరుడన్’కు ఇది తెలుగు రీమేక్ కాగా, దర్శకుడు విజయ్ కనకమేడల ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించారు. గుడి నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల కథగా రూపొందిన ఈ చిత్రం, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కించబడింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై ఉత్కంఠ పెరిగింది.

Arjun Reddy Racha Movies : అర్జున్ రెడ్డి, రచ్చ మూవీలు ఫస్ట్ చాన్స్ నాకే వచ్చింది..!
Arjun Reddy Racha Movies : మంచు మనోజ్ రిజెక్ట్ చేసిన సినిమాలు తెలిస్తే అయ్యో.. అనుకోవాల్సిందే
ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మనోజ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అభిమానులకు షాకింగ్గా మారాయి. గతంలో ‘ఆటో నగర్ సూర్య’, ‘అర్జున్ రెడ్డి’, ‘రచ్చ’ వంటి చిత్రాలు తన వద్దకు వచ్చాయని కానీ వాటిని చేయలేకపోయానని చెప్పారు. ఈ మూడు సినిమాలు తరువాత పెద్ద హిట్స్ కావడంతో “ఇవి మనోజ్ చేసి ఉంటే అతను టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచేవాడు” అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ప్రస్తుతం భైరవం మూవీ మనోజ్ కెరీర్‌లో కొత్త మలుపు తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ‘భైరవం’లోని పాత్ర ఆయనకు కొత్త అవతారంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నారు. గతానికి భిన్నంగా సీరియస్ యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ కలగలిపిన ఈ చిత్రం, మనోజ్‌కు మళ్లీ బ్రేక్ ఇవ్వగలదా? అనే ప్రశ్న సినీ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది.