Jabardast : జబర్దస్త్ మూలిగే నక్క మీద తాటిపండు, దశాబ్దకాలపు వైభవంకు తెర పడ్డట్లేనా..?
Jabardast : తెలుగు బుల్లి తెర చరిత్రలో జబర్దస్త్ అనేది ఖచ్చితంగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ టీవీ లో దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన జబర్దస్త్ కార్యక్రమం అంచెలంచెలుగా ఎదిగి అద్భుతమైన ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. మొదటి నాలుగైదు సంవత్సరాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా సాఫీగా సాగింది. ఆ తర్వాత నుండి జబర్దస్త్ కి మెల్ల మెల్లగా కష్టాలు మొదలయ్యాయి అనిపించింది… మొదట కమెడియన్స్ బయట ఆఫర్లు రావడంతో వెళ్ళి పోయారు. ఆ తర్వాత మల్లెమాల వారితో నాగబాబుకి గొడవలు రావడం వల్ల ఆయన కూడా వెళ్ళిపోయాడు. మల్లెమాల వారి యొక్క డబ్బు కాంక్ష పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సమయంలోనే జబర్దస్త్ అయిపోయిందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఆ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జబర్దస్త్ కార్యక్రమం ముందుకు సాగింది. అద్భుతమైన ప్రగతిని సాధించి ఈటీవీ భారం మొత్తం తమ భుజస్కందాలపై జబర్దస్త్ వేసుకుంది అనడంలో సందేహం లేదు. గత ఏడాది, రెండేళ్లుగా జబర్దస్త్ కామెడీ తగ్గిందంటూ.. జోరు కనిపించడం లేదు అంటూ చర్చ జరుగుతుంది. ఈ సమయంలోనే జడ్జిగా వ్యవహరిస్తున్న ఆర్.కె.రోజా తాజాగా మంత్రి పదవి దక్కడం కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి… రాబోయే రెండున్నర సంవత్సరాల పాటు ఆమె కచ్చితంగా జబర్దస్త్ లో కనిపించదు అంటూ క్లారిటీ వచ్చేసింది.జబర్దస్త్ ఇప్పటికే కష్టాల్లో ఉంటే మరింతగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా ఇప్పుడు జబర్దస్త్ కు అత్యంత పెద్ద కష్టం వచ్చిందంటూ కార్యక్రమం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజా స్థానంలో ఇంద్రజ లేదా ఆమని కొనసాగే అవకాశాలున్నాయని.. కానీ వారి వల్ల ఎంత వరకు ఉపయోగం ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది… శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని ఇంద్రజ బాగానే ముందుకు తీసుకు వెళ్తుంది. కానీ రోజా స్థాయిలో జబర్దస్త్ ముందుకు తీసుకెళ్లడం ఆమెకు సాధ్యమవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు వారాలు అంటే ఏమో కానీ ముందు ముందు పూర్తి స్థాయిలో రోజా లేని లోటును ఇంద్రజ లేదా ఆమని లు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయా అంటూ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది.