Bala Krishna : బాలకృష్ణ నుండి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిన సింహాద్రి.. ఎలా జరిగిందో చెప్పిన సముద్ర
Bala Krishna : సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆయన ఒకప్పుడు మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే వారు. అప్పట్లో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన సింహాద్రి మూవీని బాలకృష్ణతో చేయాల్సిందట. కాని అది ఎన్టీఆర్ దగ్గరకు వచ్చింది. హీరో జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా సింహాద్రి .. ఈ సినిమా ఎన్టీఆర్ కి హిట్టు మాత్రమే కాదు అభిమానుల్లో మాస్ హీరో అనే పేరును తెచ్చిపెట్టింది.ఆ తర్వాత ఎన్టీఆర్ ఎక్కువ మాస్ సినిమాలనే చేసుకుంటూ వచ్చారు. అయితే ముందుగా ఈ సినిమా హీరో బాలకృష్ణ దగ్గరికి వెళ్లిందట కానీ అయన ఈ సినిమాని రిజెక్ట్ చేసారట.
తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు సముద్ర స్పందించారు. విజయేంద్ర ప్రసాద్ .. సింహాద్రి కథ నాకే చెప్పారు. నేను బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ వాళ్లకి కథ చెప్పాను. కాని నచ్చలేదు. దీంతో రాజమౌళి సింహాద్రి సినిమా చేశారు. అయితే నన్ను మధ్యలో పక్కన పెట్టేశారు. వారు పక్కన పెడుతున్నారనే విషయం నాకు అర్దమై నేను తప్పుకున్నాను. మళ్లీ వాళ్లు నాకు సారీ చెప్పి సినిమా కూడా చేశారు అని అన్నారు.ఈ సినిమా గురించి గతంలో రచయిత పరచూరి గోపాల కృష్ణ కూడా స్పందించారు.
Bala Krishna : గోల్డెన్ హిట్ మిస్ చేసుకున్న బాలయ్య
విజయేంద్ర ప్రసాద్ రాసిన ‘సింహాద్రి’ కథ బాలకృష్ణకు వద్దకు వస్తే..ఈ స్క్రీన్ ప్లే థియరీలో ఇప్పటికే సినిమాలు తీశాం కదా. వద్దులే అంటూ ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించారు.అదే సమయంలో బాలయ్యకు ‘పలనాటి బ్రహ్మనాయుడు’ కథ నచ్చడంతో బి.గోపాల్ దర్శకత్వంలో ఆ సినిమా చేశారు. ఆ సినిమాకు డైలాగులు రాసామని చెప్పారు. ఒకవేళ ఈ సినిమాను బాలకృష్ణ ఒప్పుకొని ఉంటే, అప్పట్లోనే బాలయ్య,రాజమౌళి కాంబినేషన్‌ను ప్రేక్షకులు చూసి ఉండేవారమే అని పరచూరి అన్నాడు.