Unstoppable : ‘అన్‌స్టాపెబుల్’ షోలో బాలకృష్ణ ట్విస్టులు.. మామూలుగా లేవు..
Unstoppable : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ‘అఖండ’ ఫిల్మ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను -బాలయ్య కాంబోలో వచ్చిన ఈ హ్యట్రిక్ చిత్రాన్ని ప్రేక్షకుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సంగతులు అలా ఉంచితే.. బాలయ్య మొదటి సారి ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో చేస్తున్న షో ‘అన్ స్టాపెబుల్ విత్ ఎన్ బీకే’. కంప్లీట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో బాలయ్య ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ షోకు ఇప్పటికే చాలా మంది అతిథులు వచ్చారు.సీనియర్ నటుడు మోహన్ బాబు, ఆయన ఫ్యామిలీ మెంబర్స్, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాని తదితరులు ఈ షోకు వచ్చారు.
ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ వారం ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది. కాగా, తాజాగా మరో మాస్ గెస్ట్ హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండవుతున్నాయి.మాస్ మహారాజా రవితేజ ‘ఆహా’షోకు హాజరవుతున్నారు. అయితే, గతంలో బాలయ్య, రవితేజ మధ్య గొడవలు జరిగాయని ప్రచారం ఉంది.

balakrishna giving unstoppable expected twists through aha show
Unstoppable : ఎవరూ ఊహించని రీతిలో బాలయ్య హోస్టింగ్..
ఓ హీరోయిన్ విషయమై వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని టాక్. కాగా, ఈ షోలో ఆ విషయాలను బాలయ్య ప్రస్తావిస్తారా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా బాలయ్య సినీ ప్రేక్షకులకు ‘ఆహా’ ద్వారా ఊహించని ట్విస్టులు ఇస్తున్నారని నందమూరి అభిమానులు అంటున్నారు. ఇకపోతే రవితేజ ‘క్రాక్’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో కలిసి ‘అన్ స్టాపెబుల్’షోకు హాజరవుతున్నారు. గోపీచంద్ మలినేని తన నెక్స్ట్ మూవీ బాలయ్యతో చేస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఆల్రెడీ అయిపోయాయి. ఇందులోనూ హీరోయిన్‌గా శ్రుతిహాసన్ నటిస్తోంది.
balakrishna giving unstoppable expected twists through aha show