Bapu : ఆయన చేతి నుండి జాలువారిన చిత్రాలు ఎంతో విలువైనవి…!
Bapu: సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ అలియాస్ బాపు. ఈయన ఒక బహుముఖ ప్రజ్ఙాశాలి. ఈయన పేరు వినగానే ముందుగా గుర్తొచ్చెది ఆయన వేసిన బొమ్మలు. ఈయన ఒక చిత్రకారుడు మాత్రమే కాదు, కార్టునిస్ట్, అలాగే తెలుగులో ఎన్నో సినిమాలకు గాను దర్శకత్వం వహించారు. ఆయన ఎంచుకునే కథలు కూడా వేరే దర్శకులతో పోలిస్తే ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. దాదాపుగా తను గీసిన చిత్రాలలో అన్ని పాత్రలు కదలాడుతుంటాయి. అందాల భామను వర్ణించడానికీ ‘బాపు బొమ్మ’ అని ఇప్పటికి మనం వాడుతుంటాము. ఇదొకట్టే కాదు ఆయన చేతి రాతకు కూడా ఒక ప్రత్యేకత ఉంది అదే బాపు ఫాంటుగా మనం చూస్తూంటాము. సాధారణంగా ఏ వ్యక్తికైన ఒక సర్ నేం ఉంటుంది. కాని బాపు అనగానే వెంటనే రమణ అనే పేరు ఎప్పుడు జంట పదం గా వినిపిస్తుంది. తన స్నేహితుని పేరు జంటగా రావడం అనేది వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం తెలపకనే తెలుపుతుంది.

baapu’s paintings are very auspicious
బాల అనే చిన్నపిల్లల మ్యాగజైన్‌కు ‘అమ్మమాట వినకపోతే’ అనే కథను రమణ రాస్తే, దానికి బాపు బొమ్మలు వేశారు. అలా వారి ప్రయాణం మొదలైంది.
అలాగే కోతికొమ్మచ్చి, బుడుగు ఇలా ఎన్నో కథలు రమణ గారి రాతలో, బాపుగారి బొమ్మలలో ఒదిగిపోయాయి. బాపుగారు దర్శకత్వం సాక్షి నుంచి మొదలై శ్రీరామరాజ్యం వరకు సాగింది. అయితే తెలుగులోనే కాక హిందీలో కూడా కొన్ని సినిమాలకుగాను దర్శకత్వం అందించారు. సీతాస్వయంవర్, అనోఖా శివభక్త్, హమ్ పాంచ్, ప్రేమ్ ప్రతిజ్ఞా లాంటి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇంకోక విశేషం ఏమిటంటే వారు స్వర్గస్తులై దాదాపుగా ఏడు సంవత్సరాలు కావోస్తున్న ఇప్పటికి కొన్ని కథలు ధారవాహికంగా బుల్లి తెరలో కనువిందు చేయడమే. ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందాయి. అచ్చ తెలుగు సినిమాలకి కెరాఫ్ అడ్రస్ గా ప్రేక్షకుల మదిలో నిలిచిపొయాయి.
Bapu : వీరి చిత్ర కావ్యాలను ఎన్నటికి మరిచిపోలేము.
ఆయన చేతి నుండి జాలువారిన చిత్రాలు విలువైనవె కాదు తెలివైన భావచిత్రాలు కూడా. పొదుపుగా గీతలు వాడటం. ప్రవహించినట్లుండే ఒరవడి సందర్భానికి తగిన భావము తెలుగుదనము వాటిలోని ప్రత్యేకతలు. ఇప్పటికి బాపుగారి సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చెవి బాలరాజు కథ, అందాల రాముడు, ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం, శ్రీరామరాజ్యం, రాధాగోపాళం, లాంటి కమనీయమైన సినిమాలే. ఇలాంటి సినిమాలని మళ్ళీ తెరకెక్కించాలంటే మరో బాపు రమణలు జన్మించాల్సిందే. వీరి చిత్ర కావ్యాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మర్చిపోలేరు.