Big Boss 5 Telugu : ఈ వారం ‘బిగ్ బాస్’ నుంచి ఇద్దరు అవుట్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Big Boss 5 Telugu : ఈ వారం ‘బిగ్ బాస్’ నుంచి ఇద్దరు అవుట్..?

 Authored By mallesh | The Telugu News | Updated on :6 November 2021,3:37 pm

Big Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గత సీజన్స్‌తో పోల్చితే చాలా భిన్నంగా, ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్కుల విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్‌కి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. హౌస్‌లోకి ప్రతీ సారి 16 మంది కంటెస్టెంట్స్‌ను తీసుకుంటారు. కానీ, ఈ సారి 19 మందిని తీసుకుంన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ వీక్ సరయు, సెకండ్ వీక్ ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగో వారం నటరాజ్ మాస్టర్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా, ఐదో వారం హమీదా, ఆరో వారం శ్వేతా వర్మ, ఏడో వారంలో ప్రియా, ఎనిమిదో వారంలో లోబో అవుట్ అయ్యారు.

Bigg Boss 5 Telugu

Bigg Boss 5 Telugu

దాంతో హౌస్‌లో ప్రజెంట్ 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కాగా, ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారో అని ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ‘బిగ్ బాస్’హౌస్‌లో ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. కాగా, ఈ వారం ఎలిమినేట్ అనే విషయమై ఊహాగానాలు వస్తుండగా, ఈ సారి ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ వీక్‌లో షణ్ముక్ జస్వంత్, యానీ మాస్టర్ తప్ప అందరూ నామినేషన్‌లో ఉన్నారు. విశ్వ, ప్రియాంక, జెస్సీ, కాజల్ డేంజర్ జోన్‌లో ఉండగా, ఇటీవల టాస్కుల్లో జెస్సీ, కాజల్‌లకు ఇతరులతో పోల్చితే ఎక్కువ ఓట్లు రాగా, వారు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఒకవేళ ఊహాగానాల ప్రకారం.. ఈసారి ఇద్దరు సభ్యులు ఎలిమినేట్ అయితే తొమ్మిది మందే హౌస్‌లో ఉంటారు.

Big Boss 5 Telugu : ఈసారి డబుల్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్!

కాగా, చూడాలి ఎవరు ఎలిమినేట్ అయితారో మరి.. అయితే, సోషల్ మీడియాలో ఈ సారి ఎలిమినేట్ అయేది విశ్వ, ప్రియాంకనేని వార్తలొస్తున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఇక మిగిలింది ఐదు వారాలు కాగా చివరకు కంటెస్టెంట్స్‌లో ఎవరు బిగ్ బాస్ టైటిల్ ప్లస్ ప్రైజ్ మనీ గెలుచుకుంటారో.. చూడాలి..

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది