Game Changer Movie : అర్ధాంతరంగా ఆగిపోయిన రామ్ చరణ్ “గేమ్ చేంజర్” షూటింగ్.. చేతులెత్తేసిన శంకర్..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కెరియర్ లో 15వ సినిమా “గేమ్ చేంజర్”. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ టాప్ మోస్ట్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని.. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి దాదాపు ఏడాది కావస్తోంది. కానీ సినిమా ప్రారంభించిన నాటినుండి షూటింగ్ అనేక రీతులలో వాయిదాలు పడటం జరిగింది. చాలా నెలలు గ్యాప్ తీసుకుంటూ నత్తనడకన “గేమ్ చేంజర్” షూటింగ్ జరుగుతుంది. మరోపక్క బడ్జెట్ పెరిగిపోతోంది.
సినిమా ప్రారంభంలో అనుకున్న బడ్జెట్ కంటే ఇప్పుడు మరింతగా పెరగటంతో నిర్మాత ధీర్ రాజు ఫుల్ ఆగ్రహం మీద ఉన్నారట. “గేమ్ చేంజర్” షూటింగ్ జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా ఆపేసి “ఇండియన్ 2” షూటింగ్ చేసిన క్రమంలో సైతం శంకర్ వ్యవహరించిన తీరు.. దిల్ రాజుకి మొదటి నుంచి నచ్చలేదట. ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చుపెట్టే రీతిలో శంకర్.. వ్యవహరిస్తూ ఉండటంతో బడ్జెట్ తడిసి మోపిడుగుతున్న పరిస్థితి నెలకొందట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయినా గాని అనవసర ఖర్చులకు పోవటంతో పాటు షూటింగ్లకు శంకర్ పదేపదే వాయిదా వేస్తూ ఉండటంతో..
శంకర్ కి దిల్ రాజ్ కి మధ్య క్లాష్ వచ్చినట్లు టాక్. సినిమా ప్రారంభించిన తొలి నాలో ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేశారు. కానీ తాజా పరిస్థితి బట్టి చూస్తే వచ్చే ఏడాది ఆగస్టు మాసంలోనైనా రిలీజ్ చేసే అవకాశం కనిపించడం లేదట. ఇంకా చాలా సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మరోపక్క బడ్జెట్ పెరిగిపోతూ ఉండటంతో నిర్మాత దిల్ రాజు.. ప్రాజెక్ట్ ఆపేయాలని అనుకుంటున్నట్లు దీంతో శంకర్ కూడా చేతులెత్తేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలం షూటింగ్లో పాల్గొనడంతో పాటు తన కెరీర్లో ఇది 15వ సినిమా కావటంతో రామ్ చరణ్ సినిమా కంటిన్యూ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మరోపక్క టాక్ నడుస్తోంది.
https://youtu.be/DbrO5ONlCrc