Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లీక్‌ లు ఈసారి ఉండవట.. నమ్మవచ్చా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లీక్‌ లు ఈసారి ఉండవట.. నమ్మవచ్చా?

 Authored By aruna | The Telugu News | Updated on :5 August 2022,3:40 pm

Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాగార్జున పై ఇప్పటికే ప్రోమో షూటింగ్ కూడా జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియో లో కొత్తగా బిగ్ బాస్ కోసం మళ్లీ సెట్టింగ్ నిర్మిస్తున్నారని సమాచారం అందుతోంది. గత సీజన్లో ప్రతి వీకెండ్ లో కూడా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయమై ఒక రోజు ముందుగానే లీక్ వచ్చేది. ఆ లీక్ వల్ల షో పై ఆసక్తి తగ్గింది అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే బిగ్ బాస్ లీక్ లేకుండా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం అందుతోంది.

విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ఇక నుండి వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ కి సంబంధించిన మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ లో పాల్గొన్న వారు ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఎలాంటి విషయం బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారట. బిగ్బాస్ లీక్ కాకుండా చూసుకుంటే కచ్చితంగా మంచి రేటింగ్‌ వస్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం. అందుకే సెక్యూరిటీ ని భారీగా పెంచడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం వల్ల బిగ్ బాస్ స్టార్ మా వారు భావిస్తున్నారు.

Bigg Boss 6 Telugu interesting update

Bigg Boss 6 Telugu interesting update

అందులో భాగంగానే బడ్జెట్ కాస్త ఎక్కువైనా కూడా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా లీకులకు సంబంధించిన అడ్డుకట్ట వేయడం కోసం సెట్టింగ్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఆగష్టు చివరి వారం లో లేదా సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్‌ బాస్‌ కి నిజంగానే లింకులను అరికట్టినట్లయితే మంచి రేటింగ్ వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ల విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు, కానీ కంటెస్టెంట్ లు ఫైనల్ అయ్యారని హోస్ట్‌ గా నాగార్జున రాబోతున్నాడని బిగ్బాస్ వర్గాల వారు అధికారికంగా చెబుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది