Bigg Boss OTT Shanmukh : బిగ్ బాస్ ఓటీటీ షణ్ముఖ్ సిరి తరహా లవ్ ట్రాక్‌ రిపీట్ చేసే ప్లాన్‌ | The Telugu News

Bigg Boss OTT Shanmukh : బిగ్ బాస్ ఓటీటీ షణ్ముఖ్ సిరి తరహా లవ్ ట్రాక్‌ రిపీట్ చేసే ప్లాన్‌

Bigg Boss OTT Shanmukh : తెలుగు ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా ఓటీటీ ద్వారా బిగ్‌ బాస్‌ రాబోతున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్‌ అంటేనే వివాదాలు మరియు వినోదం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ ప్రేక్షకులు ప్రతి సీజన్లో కూడా సరికొత్త అనుభూతిని కావాలని ఉబలాట పడుతూ ఉంటారు. గత బిగ్‌ బాస్‌ సీజన్ లో షన్నూ మరియు సిరి యొక్క ప్రేమాయణం గురించి అంత చర్చించుకున్నారు. ఆ సీజన్ మంచి విజయం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 January 2022,11:10 am

Bigg Boss OTT Shanmukh : తెలుగు ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా ఓటీటీ ద్వారా బిగ్‌ బాస్‌ రాబోతున్న విషయం తెల్సిందే. బిగ్ బాస్‌ అంటేనే వివాదాలు మరియు వినోదం అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ ప్రేక్షకులు ప్రతి సీజన్లో కూడా సరికొత్త అనుభూతిని కావాలని ఉబలాట పడుతూ ఉంటారు. గత బిగ్‌ బాస్‌ సీజన్ లో షన్నూ మరియు సిరి యొక్క ప్రేమాయణం గురించి అంత చర్చించుకున్నారు. ఆ సీజన్ మంచి విజయం దక్కించుకోవడంలో వారి ప్రేమ ఒక కారణం అనడంలో సందేహం లేదు. అదంతా స్క్రిప్ట్ అని కొందరు అనుకున్నా.. కొందరు మాత్రం దాన్ని నమ్మారు.

వారిద్దరి మధ్య ఉన్న వ్యవహారం ఏంటి అనేది పక్కన పెడితే వారి మధ్య నడిచిన సన్నివేశాలు కచ్చితంగా షో కు మంచి హైప్ తీసుకు వచ్చాయి అనడంలో సందేహం లేదు. అందుకే అదే తరహా లవ్ ట్రాక్ ని ఓటీటీ వర్షన్‌ లో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ లో కూడా జొప్పించే ప్రయత్నాలను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సారి బిగ్ బాస్ కు ఓంకార్ దర్శకత్వం వహిస్తాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన దర్శకత్వం అంటే కచ్చితంగా మాల్ మసాలా ఫుల్ గా ఉంటుంది అంటూ నెటిజన్లు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఓంకార్‌ నుండి వస్తున్న బిగ్బాస్ అవ్వడం వల్ల ఖచ్చితంగా లవ్ ట్రాక్… కామెడీ ట్రాకులు ఇతర ట్రాక్‌ లు ఉంటాయని అంతా నమ్ముతున్నారు.

Bigg Boss 6 Telugu Ott update

Bigg Boss 6 Telugu Ott update

Bigg Boss OTT Shanmukh : ఓటీటీ బిగ్ బాస్ లో లవ్ ట్రాక్‌

బిగ్ బాస్ లో ఈ సారి అధికంగా సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. సినిమా సెలబ్రెటీలను తీసుకోవాలంటే ఎక్కువ పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది… కనుక ప్రస్తుతం ట్రెండ్‌ లో ఉన్న సోషల్ మీడియా సెలబ్రిటీలను తీసుకోవడం ద్వారా ఆ షో కు మంచి హైప్‌ తీసుకురావాలనే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బిగ్బాస్ ఓటీటీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి చివరి వారంలో లేదా మార్చి మొదటి వారంలో ఈ షో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు సంక్రాంతి సందర్భంగా తెలియజేస్తారని సమాచారం అందుతోంది.

prabhas

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...