Bigg Boss 8 Telugu : ఇప్పుడు కదా అసలు గేమ్ మొదలయ్యేది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో ఎలా ఉంటుంది..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. మొన్నటి వరకు కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులకి కాస్త అసంతృప్తి ఉండేది. కాని ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో రచ్చ మొదలు కానుంది. గత సీజన్ల మాదిరిగా కాకుండా.. ఈసారి ఏకంగా ఎనిమిదిమంది వైల్డ్ కార్డ్స్ ను హౌస్ లోకి ఒకేసారి పంపించాడు. ఆవైల్డ్ కార్డ్స్ అందరినిని కలిపి ఒక క్లాన్ గా చేశాడు. క్లాన్ లో మొదటిగా వెళ్ళింది హరితేజ ఆమె […]
ప్రధానాంశాలు:
Bigg Boss 8 Telugu : ఇప్పుడు కదా అసలు గేమ్ మొదలయ్యేది.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో ఎలా ఉంటుంది..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. మొన్నటి వరకు కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకులకి కాస్త అసంతృప్తి ఉండేది. కాని ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌తో రచ్చ మొదలు కానుంది. గత సీజన్ల మాదిరిగా కాకుండా.. ఈసారి ఏకంగా ఎనిమిదిమంది వైల్డ్ కార్డ్స్ ను హౌస్ లోకి ఒకేసారి పంపించాడు. ఆవైల్డ్ కార్డ్స్ అందరినిని కలిపి ఒక క్లాన్ గా చేశాడు. క్లాన్ లో మొదటిగా వెళ్ళింది హరితేజ ఆమె బిగ్ బాస్ తెలుగు ఫస్ట్ సీజన్ లో టాప్ కంటెస్టెంట్ గా ఉంది. టేస్టీ తేజ కూడా హౌజ్‌లోకి వెళ్లాడు. నాలుగో సీజన్ లో గేమ్ అదరగొట్టిన దిల్ సే మోహబూబ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. గత సీజన్‌లో సందడి చేసిన గౌతమ్ కూడా హౌజ్‌లోకి వచ్చాడు.
Bigg Boss 8 Telugu ఇప్పుడు గేమ్ స్టార్ట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో సందడి చేసిన నయని, మరో లేడీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన రోహిణి కూడా హౌజ్‌లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ముక్కు వినాష్.. గంగవ్వ ఎంట్రీతో ముగించారు. వీరిద్దరు సీజన్ 4 లో సందడి చేసినవారే. గంగవ్వ.. మధ్యలో హౌస్ లో ఉండలేక బయటకు వెళ్ళిపోయింది. ఇక ముక్కు అవిశాష్ మాత్రం గతంలో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి.. గట్టిపోటీ ఇచ్చాడు. ఈసారి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే వచ్చాడు. ఇక గంగవ్వ ఈసారి కంప్లీట్ అయ్యే వరకూ ఆడతానంటూ మాట ఇచ్చింది.ఇలా ఘనంగా రీ లాంచ్ ఈవెంట్ ముగిసింది. ఆల్రెడీ హౌస్లో ఉన్న 8 మంది ఒక క్లాన్ గా.. వైల్డ్ కార్డ్స్ మరొక క్లాన్ గా టాస్క్ లలో పోటీపడనున్నారు.
ఇక సోమవారం యధావిధిగా నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. యష్మిని హరితేజ నామినేట్ చేసింది. హరితేజకు యష్మి ఆటపై మంచి అభిప్రాయం లేదు. ఈ విషయాన్ని ఆమె నేరుగా నాగార్జునతో వేదికపై చెప్పారు. యష్మికి గట్టిగా ఇస్తానని పరోక్షంగా వెల్లడించింది. హౌస్లో సుత్తి ఎవరు అనగా? హరితేజ.. యష్మి పేరు చెప్పిన సంగతి తెలిసిందే.మెజారిటీ కంటెస్టెంట్స్ యష్మి ని నామినేట్ చేశారట. ఆమెకు అత్యధికంగా వ్యతిరేక ఓట్లు పడ్డాయట. ప్రక్రియ ముగిసిన అనంతరం గంగవ్వ, యష్మి, విష్ణుప్రియ, పృథ్విరాజ్, సీత, మెహబూబ్ నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. వీరిలో వచ్చే వారం ఒకరు ఎలిమినేట్ అయ్యా ఛాన్స్ ఉంది.