Bigg Boss OTT Telugu : ఈసారి బిగ్ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే మూడు రోజులు.. మస్త్‌ ఎంటర్టైన్‌మెంట్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss OTT Telugu : ఈసారి బిగ్ బాస్‌ గ్రాండ్‌ ఫినాలే మూడు రోజులు.. మస్త్‌ ఎంటర్టైన్‌మెంట్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :17 May 2022,10:00 pm

Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్ తెలుగు నాన్ స్టాప్ ముగింపు దశకు వచ్చింది. ఎప్పుడైనా సీజన్‌ ముగిసే సమయంకు హౌస్ లో కంటెస్టెంట్స్ కేవలం అయిదుగురు మాత్రమే ఉండే వారు. కాని ఈసారి మాత్రం చివరి వారం ముగియబోతున్నా ఇంకా ఏడు మంది ఉన్నారు. ఇంకా రెండు వారాలు కొనసాగించే అవకాశం అస్సలే లేదు. ఒకటి రెండు రోజుల్లో మొత్తం షో కు పేకప్ చెప్పబోతున్నారు. కనుక బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే చాలా విభిన్నంగా జరుగబోతుంది అంటూ డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌ వర్గాల వారి నుండి సమాచారం అందుతోంది.

మాకు అందిన సమాచారం ప్రకారం ఈ సారి బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ ను ఏకంగా మూడు రోజుల పాటు చిత్రీకరించబోతున్నారట. సాదారణంగా అయితే రెండు రోజులు మాత్రమే చిత్రీకరణ ఉంటుంది. కాని ఈసారి గురు వారం నుండి మొదలుకుని ఒక్కో రోజు ఒక్కరిని ఎలిమినేట్ చేస్తారు. డాన్స్ కార్యక్రమాలు ఉండటంతో పాటు పాత కంటెస్టెంట్స్ అంతా కూడా స్టేజ్ పై సందడి చేసే ఎపిసోడ్‌ చివరి రోజు చిత్రీకరిస్తారు. సినిమా ప్రమోషన్స్‌ తో పాఉట ఇతర ప్రమోషన్స్ కోసం బిగ్‌ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్‌ ఫినాలేను ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తోంది.గురువారం ఎపిసోడ్‌ లో ఒకరు, శుక్రవారం ఎపిసోడ్‌ లో ఒకరు ఎలిమినేట్‌ అవ్వగా చివరి రోజుకు టాప్ 5 మాత్రమే మిగులుతారు.

Bigg Boss OTT Telugu Nonstop grand final interesting update

Bigg Boss OTT Telugu Nonstop grand final interesting update

ఇది చాలా విభిన్నమైన పక్రియగా బిగ్‌ బాస్ ప్రేక్షకులు మరియు పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఈ సీజన్‌ విన్నర్ విషయం పై స్పష్టత రాలేదు. గత సీజన్ లో సన్నీ అంటూ అంతా బలంగా నమ్మారు. ఆయన విజేతగా నిలిచాడు. కాని ఈసారి మాత్రం ముగ్గురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురిలో యాంకర్‌ శివ కాస్త తక్కువ అయినా బిందు మాధవి మరియు అఖిల్‌ సార్దక్ లు ట్రోఫీ కోసం హోరా హోరీ అన్నట్లుగా ఉన్నారు. టాప్‌ 3 లో యాంకర్ శివ.. బిందు.. అఖిల్‌ లు నిలవడం నూరు శాతం పక్కా. ఆర్డర్‌ ఏంటీ అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఆదివారం మద్యాహ్నంకు ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది