Bigg Boss Season 6 : బిగ్ బాస్ సీజన్ 6 లో సామాన్యుల ఎంట్రీ ఎంపిక ఎంత వరకు వచ్చిందంటే..!
Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. హీరో గా ఎంత బిజీగా ఉన్నా కూడా నాగార్జున మరోసారి బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. నాగార్జున ఇప్పటి వరకు హోస్ట్ చేసిన అన్ని సీజన్ లకు కూడా మంచి రేటింగ్ వచ్చింది. కనుక ఈ సీజన్ కు కూడా తప్పకుండా మంచి ఆధరణ లభిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ సీజన్ లో సామాన్యులకు ఛాన్స్ ఇవ్వబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
ఇప్పటికే అందుకు సంబంధించిన ఎంపిక పక్రియ మొదలు అయ్యింది. సామాన్యులను ఎంపిక చేయడం కోసం చాలా పెద్ద టాస్క్ లను ఇస్తున్నారు. లక్షల్లో వచ్చిన అప్లికేషన్స్ నుండి వేలల్లో ఎంపిక చేయడం జరిగింది. వాటిని వడగట్టి వడగట్టి చివరకు ముగ్గురును ఎంపిక చేసే అవకాశం ఉంది. సామాన్యులు అయినా కూడా వారికి మినిమం ఎంటర్ టైన్మెంట్ పై అవగాహణ ఉండాలి. అంతే కాకుండా వారికి డాన్స్ లేదా ఏదో ఒక యాక్టివిటీ పై అవగాహణ ఉండాలి అనేది కండీషన్ గా బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇప్పటి వరకు ఫైనల్ 50 కంటెస్టెంట్స్ ను గ్రేడింగ్ చేశారట.
Bigg Boss Telugu Season 6 latest update
వారిలోంచి మళ్లీ పలు టాస్క్ లు ఇచ్చి.. పలు పరీక్షలు పెట్టి పది మందిని ఉంచి 40 మందిని ఎలిమినేట్ చేస్తారు. ఆ పది మందితో వీజే సన్నీ యాంకర్ గా ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ కార్యక్రమంలో ఏడు రోజుల పాటు ఆ పది మంది కంటెస్టెంట్స్ పాల్గొంటారు. రోజుకు ఒక్కరు చొప్పున ఎలిమినేట్ అవుతూ చివరకు ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురే బిగ్ బాస్ సీజన్ 6 లో ఉంటారు అంటూ సమాచారం అందుతోంది. బిగ్ బాస్ సీజన్ 6 ను జులై చివర్లో లేదా ఆగస్టు లో మొదలు పెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాన్ స్టాప్ కోసం వేసిన సెట్టింగ్ లో మార్పులు చేర్పులు చేస్తున్నారట.