Anasuya : అన‌సూయ బాట‌లో బ్ర‌హ్మాజీ.. నెటిజ‌న్‌పై కేసు పెడ‌తానంటున్న పాపుల‌ర్ న‌టుడు

Advertisement

Anasuya : సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బ్ర‌హ్మాజీ అప్పుడ‌ప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు షేర్ చేస్తూ ఎంట‌ర్ టైన్ చేస్తూ ఉంటారు. ఆయ‌న చేసే ట్వీట్స్ ఒక్కోసారి చ‌ర్చ‌నీయాంశంగా కూడా మారుతుంటాయి. రీసెంట్‌గా ఎయిర్‌లైన్స్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన బ్ర‌హ్మాజీ ‘వాట్స్ హ్యాపెనింగ్’ (ఏం జరుగుతోంది?) అని తన సెల్ఫీని పోస్టు చేస్తూ అభిమానులను అడిగాడు. అది చూసిన ఓ అభిమాని ‘ఏం లేదు అంకుల్’ అని బదులిచ్చాడు. ఆ రిప్లై చూసిన బ్రహ్మాజీ దానిని రీ ట్వీట్ చేస్తూ ‘అంకులేంట్రా అంకుల్. కేసు వేస్తా, బాడీ షేమింగ్ చేస్తున్నావా?’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జతచేశారు. అంతే.. క్షణాల్లోనే అది వైరల్ అయింది. అభిమానులు సరదా కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తించారు.

Advertisement

Anasuya : బ్ర‌హ్మాజీ ఫైర్..

ఆంటీని మళ్లీ రెచ్చగొట్టారని ఒకరంటే.. ఎన్ని కేసులు వేస్తానని బెదిరించినా ఆ ఆంటీకి వచ్చినంత పేరు మాత్రం మీకు రాదని ఇంకొకరు కామెంట్ చేశారు. ‘#SayNotToOnlineAbuse అనే హ్యాష్‌ట్యాగ్‌ మర్చిపోయారు అంకుల్’ అని మరొకరు.. ఇలా కామెంట్ల వర్షం కురిపించారు. అసలు విష‌యం లోకి వెళితే లైగర్ సినిమా రిలీజ్‌ రోజున యాంకర్ అనసూయ వేసిన ట్వీట్‌పై దుమారం రేగింది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కర్మ కచ్చితంగా వెంటాడి తీరుతుంది’ అంటూ ట్వీట్ చేసింది అనసూయ. అయితే గతంలో అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు విజయ్ ఫ్యాన్స్‌కి అనసూయకి మధ్య పెద్ద వివాదమే నడిచింది.

Advertisement
Anasuya Brahmaji Fire On Netizens On Uncle Calling Age Shaming
Anasuya Brahmaji Fire On Netizens On Uncle Calling Age Shaming

అన‌సూయ కామెంట్స్ కి సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఆంటీ.. ఆంటీ అని పచ్చి బూతులు తిడుతూ ట్వీట్లు చేయడంతో అనసూయ దారుణంగా ట్రోలింగ్‌కి గురైంది. దీంతో అనసూయ తగ్గేదే లే అన్నట్టుగా.. తనని ట్రోల్ చేసేవారికి కౌంటర్లు ఇస్తూ వచ్చింది. ఆంటీ అన్న వాళ్లపై కేసులు పెడతానని హెచ్చరించింది. దీంతో ట్రోలర్స్ వెనక్కి తగ్గకుండా ఆమెను ఆంటీ అంటూ రెట్టింపు ట్రోలింగ్ చేశారు. దీంతో అనసూయ నేషనల్ ట్రెండింగ్‌లో నిలిచింది.

Advertisement
Advertisement