Bheemla Nayak : బ్రేకింగ్.. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా…!
Bheemla Nayak : ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణ వార్తతో సినీ రాజకీయ వర్గాలు షాక్ లో న్నాయి. ఈ క్రమంలో పలు అధికారిక కార్యక్రమాలను రద్దు చేస్తున్నారు. రెండు రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలను ప్రకటించింది. బీసీ కార్పోరేషన్ చైర్మన్ ల మీటింగ్ తో పాటుగా పలు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసారు.
అదే విధంగా… తెలంగాణాలో మంత్రులు కూడా పలు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని గౌతం రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తూ చిత్ర యూనిట్ ప్రకటన చేసింది.

breaking Bheemla Nayak pre release event postponed
రేపు యూసఫ్ గూడ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఈ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు మంత్రి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేసారు. ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్ధించారు.