Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష ఆత్మహత్యాయత్నం.. సెట్‌లో అంతా ఆందోళన
Jabardasth Varsha : జబర్దస్త్ షోలో ఈ మధ్య వర్ష అనే అందం హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. బుల్లితెరపై ఎన్నో యేళ్లుగా నటిస్తున్నా కూడా రాని గుర్తింపును జబర్దస్త్ నాకు ఇచ్చిందంటూ వర్ష ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది. ఇమాన్యుయేల్‌తో స్కిట్లలో జోడి కట్టాక మరింతగా పాపులర్ అయింది వర్ష. ఇప్పుడు వర్ష బుల్లితెరపై ట్రెండ్ అవుతోంది. జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, స్పెషల్ ఈవెంట్లు అంటూ నానా హంగామా చేస్తోంది. ఇప్పుడు జబర్దస్త్‌లో ఆమె పెట్టిన మంట చల్లారేలా లేదు.
తాజాగా ఆమె స్కిట్ వేస్తూ అందరినీ ఏప్రిల్ ఫూల్‌ను చేసే పని పెట్టేసుకుంది. ఈ క్రమంలో ఆది వద్దకు వెళ్లి ఓ యాక్సిడెంట్ చేశానని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆది అంతగా నమ్మినట్టు కనిపించలేదు. అయితే చలాకీ చంటి వద్దకు వెళ్లి ఓ డ్రామాను ప్లే చేసింది. వాడు ఇచ్చిన డైలాగ్‌లు కాదు నువ్ ప్రాక్టీస్ చేయ్ అంటూ వర్షను కాస్త మందలించాడు చంటి. అయితే ఆమె అక్కడి నుంచి సడెన్‌గా వెళ్లిపోయింది. చూశావా? నేను చెబితే ఎలా వెళ్లి ప్రాక్టీస్ చేసుకుంటుందో అని చంటి అనేశాడు.

Chalaki Chanti serious over Jabardasth Varsha Action
jabardasth varsha : జబర్దస్త్ వర్ష ఆత్మహత్యాయత్నం..
కానీ బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసుకుంటానని వర్ష బెదిరించింది. ఇదంతా ఏప్రిల్ ఫూల్ అన్నా అని కెవ్వు కార్తీక్ అసలు సంగతి బయటపెట్టేశాడు. కానీ చంటి మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. ఒక వేళ ఆమె అక్కడి నుంచి జారి పడిందంటే బాధ్యత ఎవరిది? అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. దీంతో జబర్దస్త్ టీం లీడర్లు, కంటెస్టెంట్లు అందరూ వచ్చారు. అక్కడంతా ఆందోళనగా మారింది. అయితే ఇది ప్రోమో కోసమే చేసినట్టు కనిపిస్తోంది. చివరకు ఇది కూడా ఏప్రిల్ ఫూల్ అని కెవ్వు కార్తిక్, వర్షను ఆట పట్టించేలా ఉన్నారు.
