Director Teja : తన గురువు రామ్ గోపాల్ వర్మ గురించి డైరెక్టర్ తేజ ఏమన్నాడో చూడండి.. స్టేజీ మీదే చెప్పేసాడు !
Director Teja : దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మరో హీరో అభిరామ్ నీ “అహింస” అనే సినిమా ద్వారా హీరోగా డైరెక్టర్ తేజ పరిచయం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో డైరెక్టర్ తేజ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అసలు అభిరామ్ తోనే ఎందుకు సినిమా చేయాల్సి వచ్చింది అన్న దానికి.. తేజ వివరణ ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం దగ్గుబాటి రామానాయుడు గారు తన మనవడు అభిరామ్ తో సినిమా చేయాలని కోరారు. ఆ టైమ్ లో నేను మాట ఇవ్వడం జరిగింది.
అయితే ఆ తర్వాత అనేక మార్లు రామానాయుడు స్టూడియో నుండి ఫోన్ రావడం జరిగింది. ఆయన పిఏ ఫోన్ చేశారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత రామానాయుడు గారు మరణించడం జరిగింది. ఆ సమయంలో ఆయనకు ఇచ్చిన మాట నన్ను ఎంతగానో కలచివేసింది. దీంతో ఆయన మనవడు అభిరాం కోసం ఒక కథ సిద్ధం చేసి ఆయనకు ఇచ్చిన మాట నెరవేర్చటానికి ఈ అహింస సినిమా చేస్తున్నట్లు డైరెక్టర్ తేజ స్పష్టం చేశారు. అయితే ముందుగా ఈ విషయాన్ని నిర్మాత సురేష్ బాబు కి తెలియజేస్తే ఆయన ఒప్పుకోలేదు. తర్వాత రామానాయుడు గారికి మాట ఇచ్చాను అని అంతా విషయం తెలియజేయగా… ఆయన ఓకే చేయటం జరిగింది.
కానీ సినిమా కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత మధ్యలో ఆపేయాలని సురేష్ బాబు అయీష్టత చూపరు. నేను దీన్ని బ్లాక్ బస్టర్ చేయడం లేదా భారీ లాభాలను ఆర్జించడం గురించి కాదు.. లెజెండ్ రామానాయుడుకి నేను చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే చేసానని అన్నాను. అప్పుడు సురేష్ బాబు కూడా ఒప్పుకున్నారు! అని అన్నారు. దీంతో ఏదైనా ముక్కు సూటిగా డైరెక్టర్ తేజ అహింస ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పటం ఆర్జీవిని తలపించింది. డైరెక్టర్ తేజ రామ్ గోపాల్ వర్మ దగ్గర కెరియర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ గా పని చేశాడు. ఆయన మాదిరిగానే ముక్కు సూటిగా మాట్లాడటం డైరెక్టర్ తేజ స్టైల్. ఈ రకంగా అహింస సినిమా రామానాయుడు కోసం చేసినట్లు డైరెక్టర్ తేజ చెప్పడం సంచలనం సృష్టించింది.