Chiranjeevi – CM Revanth Reddy : బూతులు తిడితే చాలు ఈ రోజుల్లో పెద్ద నాయకులై పోతున్నారు.. చిరంజీవి కామెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chiranjeevi – CM Revanth Reddy : బూతులు తిడితే చాలు ఈ రోజుల్లో పెద్ద నాయకులై పోతున్నారు.. చిరంజీవి కామెంట్స్ కి సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

 Authored By aruna | The Telugu News | Updated on :6 February 2024,4:00 pm

Chiranjeevi – CM Revanth Reddy : ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారం పొందిన ప్రముఖ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పద్మశ్రీ అవార్డులు పొందిన దాసరి కొండప్ప, ఆనందాచారి, కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమలాల్, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్యలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున నగదు బహుమతులను అందించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పద్మ పురస్కారాలు పొందిన వారిని సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు హుందాగా ఉండాలన్నారు. వ్యక్తిగత విమర్శలు తగవని అన్నారు. ప్రస్తుత రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శల వల్లే తాను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లను ప్రజలు తిప్పకొట్టగలిగితేనే రాజకీయాల్లో కొనసాగ వచ్చేనె పరిస్థితి ఉందని చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. మాజీ ప్రధాని వాజ్ పేయి లో ఉన్నంత హుందాతనం ఆయనలో ఉందన్నారు. వెంకయ్య నాయుడు వాగ్దాటికి తాను పెద్ద అభిమానినని వెల్లడించారు. చిన్నతనం నుంచి ఆయన తనకు స్ఫూర్తి అని తెలిపారు. రాజకీయాలలో రోజురోజుకీ దుర్భాషలు ఎక్కువైపోతున్నాయని, నోరు జారి వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లకు బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉందని చిరంజీవి హాట్ కామెంట్స్ చేశారు. ఇక నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం సమక్షితమైందని చిరంజీవి కొనియాడారు.

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయన మంత్రివర్గ సహచరులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అయితే తనకు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం పద్మ విభూషణ్ వచ్చినందుకు లేదన్నారు. నేడు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయని సంతోషం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటించాక చాలాసేపటికి పద్మ విభూషణ్ ప్రకటించడం వెనుక ప్రధాని మోదీ వ్యూహం ఉందన్నారు. ముందుగా పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వాలని ఆలోచన మోడీదే అని అన్నారు. దీని ఎవరైనా అభినందించాల్సిందేనని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ పట్ల తనకు అత్యంత గౌరవం ఉందని చిరంజీవి తెలిపారు. కళను గుర్తించి అవార్డు ఇవ్వడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది