Chiranjeevi : అది చూసిన సురేఖ..తనతో పెళ్ళికి ఒప్పుకోరనుకున్న చిరంజీవి..ఇంతకీ ఆమె చూసిందేంటి..?
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడు ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య తన కూతురిని చిరంజీవికి ఇచ్చి పెళ్ళి చేయాలని సన్నాహలు చేస్తున్నారు. ఇంట్లోవాళ్ళు అందరు ఒప్పుకున్నారు. ఒక్క అల్లు అరవింద్ తప్ప. సినిమాలో చేసే వాడు కాబట్టి కొంత ఎంక్వైరీ చేయాలని..అందులో చిరంజీవి మంచివాడే అని తేలితే తప్ప తన చెల్లిని ఇవ్వకూడదని అల్లు అరవింద్ పట్టుపట్టాడు. అదే ప్రయత్నాలలో ఉన్నారు. అయితే ఇలా ఎంక్వైరీ జరుగుతున్న సమయంలోనే అనుకోకుండా చిరంజీవి చిక్కుల్లో పడ్డారు. ఆ చిక్కులేంటో ఇప్పుడు చూద్దాం.

chiranjeevi-wife surekha might have not accepted him due to this
శంకరాభరణం సినిమా రిలీజైన రోజులవి. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన మంజు భార్గవి ఈ సినిమా ప్రీమియర్ షోకి రావాల్సిందిగా చిరంజీవిని కోరింది. అంతేకాదు అల్లు రామలింగయ్య కుటుంబాన్ని ఆమె ఆహ్వానించారు. తన కోరిక మేరకు ఇటు చిరంజీవి, అటు అల్లు రామలింగయ్య, ఆయన కూతురు సురేఖ ప్రిమియర్ షోకి వచ్చారు. సినిమా చూస్తున్న సమయంలో క్లైమాక్స్ సన్నివేశాలు చాలా ఎమోషనల్ గా ఉండటంతో ఆ ఎమోషన్ సీన్స్ కి చిరంజీవి కన్నీళ్ళు పెట్టుకున్నారట. అది చూసి ఆడియన్స్ ఏమనుకుంటారో అని మళ్ళీ కంగారుగా తన జేబులో నుంచి ఖర్చీఫ్ తీసుకొని కళ్ళు తుడుచుకుంటున్నాడట.
Chiranjeevi : చిరంజీవి చేతిలో మంజు భార్గవి చీరకొంగు సురేఖతో పాటు అల్లు రామలింగయ్య చూశారట.

chiranjeevi-wife surekha might have not accepted him due to this
అది గమనించిన మంజు భార్గవి తన చీరకొంగును ఇచ్చి తుడుచుకోమని చెప్పిందట. సరిగ్గా చిరంజీవి చేతిలో మంజు భార్గవి చీరకొంగు ఉన్నప్పుడు లైట్స్ ఆన్ అయ్యాయట. అది అక్కడున్న సురేఖతో పాటు అల్లు రామలింగయ్య కూడా చూశారట. దాంతో చిరంజీవి కంగారు పడినట్టు సమంత టాక్ షోలో వెల్లడించారు. అంతేకాదు ఇక సురేఖని నాకిచ్చి పెళ్ళి చేయరని డిసైడయ్యాడట. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ నార్మల్ గానే ఉండి మళ్ళీ చిరంజీవితో మాట్లాడినట్టు తెలిపారు. ఇది ఓ ఫన్ ఇన్సిడెంట్ లా భావించారు తప్ప కాస్త కూడా తప్పు పట్టలేదని చెప్పారు. ఎక్కడ ఈ సంబంధం తప్పిపోతుందో అని భయపడిన చిరంజీవికి ఇలాంటివేమీ పట్టించుకోకుండా అల్లు ఫ్యామిలీ చిరుకి సురేఖను ఇచ్చి పెళ్ళి జరిపించారు.
ఇది కూడా చదవండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?
ఇది కూడా చదవండి ==> ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్
ఇది కూడా చదవండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!