Keerthy Suresh : కీర్తి సురేష్ లవ్ మ్యారేజ్ నిజమేనా? క్లారిటీ ఇచ్చిన కీర్తి తల్లి.. ఎవరిని చేసుకోబోతుంది?

Advertisement

Keerthy Suresh : కీర్తి సురేష్ తెలుసు కదా. తను అందాల తార. మహా నటి. ఏకంగా సావిత్రి పాత్రలోనే జీవించేసింది. తను ఏ సినిమాలో నటించినా కూడా అంతే. నూటికి నూరు శాతం తన నటనకు న్యాయం చేస్తుంది. తను ఇప్పటి వరకు చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ సత్తా చాటుతున్న కీర్తి సురేశ్ గురించి ఈ మధ్య కొన్ని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేశ్ లవ్ లో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఏకంగా తమిళ్ హీరో విజయ్ నే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి.

clarity on keerthy suresh love marriage
clarity on keerthy suresh love marriage

తమిళ్ హీరో విజయ్ కి ఇప్పటికే పెళ్లి అయిన విషయం తెలిసిందే. తన భార్యకు విడాకులు ఇచ్చి మరీ కీర్తి సురేశ్ ను పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. వామ్మో.. ఏకంగా హీరో విజయ్ తోనే పెళ్లా అని అందరూ షాక్ అయిపోయారు. అంతే కాదు.. తను వేరే అబ్బాయిని కూడా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరిని లవ్ చేస్తోంది.. ఎవరిని పెళ్లి చేసుకుంటుంది అంటూ నెటిజన్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈనేపథ్యంలో కీర్తి సురేశ్ తల్లి మేనక క్లారిటీ ఇచ్చేసింది.

Advertisement
clarity on keerthy suresh love marriage
clarity on keerthy suresh love marriage

Keerthy Suresh : ఆ వార్తలు అన్నీ అవాస్తవం

ఆ వార్తలు అన్నీ అవాస్తవం అని… తన కూతురు ఎవరినీ ప్రేమించడం లేదని మేనక క్లారిటీ ఇచ్చేసింది. తన చిన్ననాటి స్నేహితుడు లేడు.. ఎవరూ లేరు. ఎవ్వరినీ మా అమ్మాయి ప్రేమించడం లేదు. అవన్నీ ఉత్త పుకార్లే. ఏదైనా ఉంటే మా నుంచి అధికారిక ప్రకటన వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను అభిమానులు నమ్మొద్దు అంటూ కీర్తి సురేశ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది తన తల్లి మేనక. అన్నట్టు కీర్తి సురేశ్ తల్లి మేనక కూడా ఒకప్పుడు నటినే. తన ద్వారా వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కీర్తి సురేశ్. అనతి కాలంలోనే తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది.

Advertisement
Advertisement