Dhanraj : కమెడియన్ నుంచి హీరో.. ఒక్కసారిగా బోరున ఏడ్చేసిన ధన్‌రాజ్
Dhanraj : బుల్లితెర సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. సెల్ చేతిలో ఉందంటే చాలా మంది కాలక్షేపానికి అదే పెట్టుకుని చూస్తుంటారు.ఇందులోని కమెడియన్స్ వేసే పంచులు, పేల్చే జోకులు విని కాసేపు మనశ్శాంతిని పొందుతారు జనాలు. ఉరుకుల పరుగుల జీవితంలో జబర్దస్త్ కామెడీ షో అనేది చాలా మందికి ఒక రిలాక్సేషన్ లాగా పనిచేస్తుంది. అందుకే ఈ షో రేటింగ్స్ పరంగా టాప్‌లో కొనసాగుతోంది. జబర్దస్ షో చాలా మంది కమెడియన్స్‌కు […]
Dhanraj : బుల్లితెర సక్సెస్ ఫుల్ కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. సెల్ చేతిలో ఉందంటే చాలా మంది కాలక్షేపానికి అదే పెట్టుకుని చూస్తుంటారు.ఇందులోని కమెడియన్స్ వేసే పంచులు, పేల్చే జోకులు విని కాసేపు మనశ్శాంతిని పొందుతారు జనాలు. ఉరుకుల పరుగుల జీవితంలో జబర్దస్త్ కామెడీ షో అనేది చాలా మందికి ఒక రిలాక్సేషన్ లాగా పనిచేస్తుంది. అందుకే ఈ షో రేటింగ్స్ పరంగా టాప్‌లో కొనసాగుతోంది. జబర్దస్ షో చాలా మంది కమెడియన్స్‌కు జీవితాన్ని ప్రసాదించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Dhanraj : కమెడియన్ టు నటుడిగా..
జబర్దస్త్ కామెడీ షో ప్రారంభించి ఇటీవల తొమ్మిదేళ్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఈ సందర్బంగా ఈటీవీ యాజమాన్యం ప్రత్యేకమైన ఈవెంట్‌ను ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.ఇదిలాఉండగా కమెడియన్స్ అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ తాజా వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన ధనరాజ్ ఇప్పుడు తాజాగా ‘బుజ్జీ ఇలా రా’ అనే చిత్రంతో హీరో అవతారం ఎత్తాడు.తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ధన్‌రాజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో యాక్టర్ కమ్ కమెడియన్ సునీల్ కూడా ఈ సినిమాలో కీలకపాత్ర చేస్తున్నాడు. తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాంది సినిమా డైరెక్టర్ విజయ్ కనకమేడల హాజరయ్యారు.ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ..తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మొదట పరిచయమైన ఫ్రెండ్ ధనరాజు అని చెప్పాడు. తామిద్దరం ఒరేయ్, బావ అని పిలుచుకునేంత మంచి స్నేహితులం అయ్యామన్నారు.ఈ రోజు ధనరాజ్ నటించిన సినిమాకు వచ్చి ఇలా మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని చెప్పడంతో.. ధనరాజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు. వెక్కివెక్కి ఏడ్చాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.