Dhanraj : శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి ధన్ రాజ్ ఎంట్రీ.. కామెడీ స్టార్స్ గుడ్ బై చెప్పాడా?
Dhanraj : కమెడియన్ ధన్ రాజ్‌కు బుల్లితెరపై మంచి ఇమేజ్ ఉంది. అయితే అంతకంటే ముందే.. వెండితెరపై ఎన్నో మంచి పాత్రలను పోషించాడు. కమెడియన్‌గా మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. స్టార్ కమెడియన్‌గా ధన్ రాజ్ మంచి డిమాండ్ ఏర్పర్చుకున్నాడు. అయితే అదే సమయంలోనూ ధన్ రాజ్ బుల్లితెరపై కనిపించాడు. జబర్దస్త్ షోలో ధన్ రాజ్ ప్రారంభంలో బాగానే చేశాడు. ఆ తరువాత మధ్యలో వెళ్లిపోయాడు.. మళ్లీ వచ్చాడు.. మళ్లీ వెళ్లిపోయాడు.. అలా వస్తూ వెళ్తూ ఉండేవాడు. చివరకు […]
Dhanraj : కమెడియన్ ధన్ రాజ్‌కు బుల్లితెరపై మంచి ఇమేజ్ ఉంది. అయితే అంతకంటే ముందే.. వెండితెరపై ఎన్నో మంచి పాత్రలను పోషించాడు. కమెడియన్‌గా మంచి ఇమేజ్ దక్కించుకున్నాడు. స్టార్ కమెడియన్‌గా ధన్ రాజ్ మంచి డిమాండ్ ఏర్పర్చుకున్నాడు. అయితే అదే సమయంలోనూ ధన్ రాజ్ బుల్లితెరపై కనిపించాడు. జబర్దస్త్ షోలో ధన్ రాజ్ ప్రారంభంలో బాగానే చేశాడు. ఆ తరువాత మధ్యలో వెళ్లిపోయాడు.. మళ్లీ వచ్చాడు.. మళ్లీ వెళ్లిపోయాడు.. అలా వస్తూ వెళ్తూ ఉండేవాడు. చివరకు ధన్ రాజ్.. నాగబాబు గ్యాంగుతో వెళ్లిపోయాడు.
అదిరింది, బొమ్మ అదిరింది, కామెడీ స్టార్స్ అంటూ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఈటీవీ, జబర్దస్త్, మల్లెమాల మీద ధన్ రాజ్ సెటైర్లు వేస్తుంటాడు. తాజాగా ధన్ రాజ్ అందరికీ ఓ షాక్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ధన్ రాజ్ తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో కనిపించాడు. ఇలా ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదు. తన సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా వచ్చాడా? లేదంటే కామెడీస్టార్స్ షోకు గుడ్ బై చెప్పాడా? అన్నది తెలియడం లేదు. తాజాగా శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో వచ్చింది.
ఇందులో ధన్ రాజ్ కనిపించాడు. ఈ ఎపిసోడ్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసినట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ధన్ రాజ్ చెప్పాడు. నువ్ ఎప్పుడైనా ఆయనతో మాట్లాడావా? అని ధన్ రాజ్‌ను ఆది అడుగుతాడు. దీంతో వెంటనే స్టేజ్ మీదనే పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేస్తాడు. చెప్పండి ధన్ రాజ్ గారు అని పవన్ కళ్యాణ్ అంటాడు. దీంతో ప్రోమో కూడా ఎండ్ అవుతుంది.