రచ్చ రచ్చ చేస్తున్నారుగా.. కామెడీ స్టార్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రచ్చ రచ్చ చేస్తున్నారుగా.. కామెడీ స్టార్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్

 Authored By uday | The Telugu News | Updated on :12 February 2021,2:08 pm

Comedy stars : కామెడీ స్టార్స్ అనే కొత్త షోను గత ఆదివారం లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అదిరింది టీం మెంబర్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిపి కామెడీ స్టార్స్ అనే కామెడీ షోను ప్రారంభించారు. దీనికి అవినాష్ హెడ్‌లా వ్యవహరిస్తున్నాడు. పటాస్ వంటి షోలను విజయవంతం చేసిన సంతోష్ దర్శకత్వం చేస్తున్నాడు. అయితే ఈ షోలో అవినాష్ తన పరిచయాలతో అందరినీ పట్టుకొచ్చేశాడు. ముఖ్యంగా అరియానా, అషూ వంటి వారిని బాగానే వాడేసుకుంటున్నారు.

అలా అవినాష్ ముందుండి తీసుకెళ్తున్న ఈ షోను గత ఆదివారం మధ్యాహ్నం 1 30 గంటలకు ప్రారంభించారు. అదే సమయంలో ఈటీవీలో శ్రేదేవీ డ్రామా కంపెనీ అనే కొత్త షో కూడా ప్రారంభం అయింది. అయితే కామెడీ స్టార్స్ అనే షోకు సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ బయటకు వచ్చాయి. అదిరిపోయే వ్యూయర్ షిప్ వచ్చిందంటూ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే సరిగ్గా పరిశీలిస్తే అదేమీ గొప్ప వ్యూయర్ షిప్ కాదు.

Comedy stars

Comedy stars

Comedy stars : కామెడీ స్టార్స్ సక్సెస్ సెలెబ్రేషన్స్

టీఆర్పీ తక్కువగా వచ్చినట్టుంది.. అందుకే దాన్ని చెప్పుకుండా వ్యూయర్ షిప్‌ను చూపిస్తున్నారు. 9.8 TVR వచ్చిందంటూ ఓ తెగ ప్రమోట్ చేసుకుంటున్నారు.. టీం మొత్తం సెలెబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే ఉన్నంతలో అది కాస్త బెటర్ అన్న మాట నిజమే. అయితే అది కూడా శేఖర్ మాస్టర్, అరియానా, అవినాష్ వంటి వాళ్లే వచ్చిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ షో అయితే గాడిని పడేలానే ఉంది. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్ డైరెక్షన్ టీం, నిర్మాత ఓంకార్ ఇలా అందరూ రచ్చ రచ్చ చేశారు.

Advertisement
WhatsApp Group Join Now

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది