Deepthi Sunaina Shanmukh : దీప్తి సునయన, షణ్ముఖ్ బ్రేకప్.. ఇద్దరికి కెరీర్ పరంగా ఎంత నష్టమో తెలుసా?
Deepthi Sunaina Shanmukh : బిగ్ బాస్ కారణమో లేదా మరేంటో కాని దీప్తి సునైన మరియు షన్నూ లు విడి పోయారు. షన్నూ నుండి దూరంగా జరుగుతున్నట్లుగా దీప్తి సునైన స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నాలుగు అయిదు సంవత్సరాల ప్రేమకు దీప్తి సునైన కన్నీటి వీడ్కోలు పలికింది. బ్రేకప్ సమయంలో ఆమె మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక వీడియోను చూస్తే అర్థం అవుతుంది. ఆమె కన్నీళ్లు ఆపుకునేందుకు ఎంత గా ప్రయత్నించినా కూడా ఆమె వల్ల కాలేదు. ఎంతో భారంగా బాధతో దీప్తి ఆ బ్రేకప్ మెసేజ్ ను పెట్టింది. దీప్తి మరియు షన్నూ లు విడిపోవడం వల్ల వారిద్దరికి మాత్రమే కాకుండా చాలా మందికి కూడా నష్టం కలిగింది అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ నుండి షన్నూ వచ్చిన వెంటనే రెండు కవర్ సాంగ్స్ మరియు ఒక మ్యూజిక్ ఆల్బమ్ తో పాటు ఒక వెబ్ సిరీస్ ను కూడా ప్లాన్ చేశారు.
వీరిద్దరికి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు కూడా వీరితో ప్రాజెక్ట్ అనుకున్నారట. కాని బ్రేకప్ అవ్వడం వల్ల అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ముఖ్యంగా ఒక భారీ 15 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ ను వీరిద్దరితో చేయాలనుకున్న నిర్మాతలు ఇప్పుడు మరో జంట కోసం వెదుకుతున్నారు. వీరిద్దరు ఆ వెబ్ సిరీస్ ను చేయడం వల్ల ఇద్దరికి కలిపి దాదాపుగా 60 లక్షల వరకు వచ్చేవని సమాచారం అందుతోంది. కేవలం ఆ వెబ్ సిరీస్ ద్వారా మాత్రమే కాకుండా కవర్ సాంగ్స్ మరియు మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా మరో 20 లక్షల వరకు ఆదాయం వచ్చి ఉండేది. సోషల్ మీడియా లో వీరికి ఉన్న క్రేజ్ నేపథ్యంలో వీరిద్దరు కలిసి బయట స్టేజ్ లపై కనిపిస్తే భారీగా పారితోషికం ఇచ్చేందుకు సిద్దంగా చాలా మంది ఉన్నారు.

Deepthi Sunaina and Shanmukh miss good chances
Deepthi Sunaina Shanmukh : బ్రేకప్ తో దీప్తి మరియు షన్నూ లు చాలా మిసయ్యారు
బ్రేకప్ అయ్యి ఉండకుంటే ఖచ్చితంగా వారిద్దరి కాంబోలో ఎంటర్ టైన్ మెంట్ మరో లెవల్ లో ఉండేది. తద్వారా వారికి కూడా ఆదాయం భారీగా వచ్చి ఉండేది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరు కలిసి వెబ్ సిరీస్ లో నటించడం, మ్యూజిక్ ఆల్బమ్ చేయడం, కవర్ సాంగ్స్ మరియు స్టేజ్ షో లతో ఇద్దరికి కలిపి కోటి రూపాయల వరకు వచ్చి ఉండేది అనేది టాక్. కోటి రూపాయలు అంటే మాటలు కాదు. ఆ అరుదైన అవకాశం వారిద్దరు బ్రేకప్ వల్ల జరిగింది. డబ్బుల కంటే ముఖ్యం వారిద్దరు ఇచ్చే ఎంటర్ టైన్ మెంట్ ను అభిమానులు ప్రేక్షకులు మిస్ అయ్యాయి. డబ్బులు వారికి కొదువ లేదు. కనుక వారు ఒకరికి ఒకరు మంచి జీవిత భాగస్వామిని కోల్పోయారు అంటూ వార్తలు వస్తున్నాయి.