Deepthi Sunaina : నువ్ ఒక కారెక్టర్ లేని దానివి!.. నెటిజన్ దారుణమైన కామెంట్లపై దీప్తి సునయన రియాక్షన్
Deepthi Sunaina : బిగ్ బాస్ ఇంట్లో దీప్తి సునయన చేసిన పిచ్చి పనుల గురించి అందరికీ తెలిసిందే. రెండో సీజన్‌లో ఎదగని మనస్తత్వం ఉన్న కంటెస్టెంట్‌గా దీప్తి సునయన మిగిలింది. కామన్ మెన్ కెటగిరీలో వచ్చిన గణేష్ కూడా అదే కోవకు చెందుతాడు. కానీ దీప్తి సునయన మాత్రం బిగ్ బాస్ ఇంట్లో ఒక్క టాస్కు కూడా సరిగ్గా ఆడలేదు. ఏమైనా అంటే తనీష్‌తో కూర్చుని ముచ్చట్లు పెట్టడం, తేజస్వీ, సామ్రాట్‌లతో సొల్లు కబుర్లు చెప్పడం తప్పా చేసిందేమీ లేదు.

deepthi sunaina gets trolling
ఇక కౌశల్ ఆర్మీ దెబ్బకు దీప్తి సునయన కూడా బలైంది. అలా నాటి విషయాలను ఓ నెటిజన్ గుర్తుకు చేశాడు. ఇక జీవితంలో చేసేది ఏముంది.. పెళ్లి చేసుకో.. నిన్ను బిగ్ బాస్ షోలో చూశాం.. నువ్ ఒక కారెక్టర్ లేనిదానివి అంటూ దారుణంగా కామెంట్ చేశాడు. దీనికి దీప్తి సునయన తన స్టైట్లో ఎంతో స్వీట్గా రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది.‘నా వయసు 23 ఏళ్లు. అప్పుడే పెళ్లి ఏంటి?.. 20 ఏళ్లకే బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లాను. అక్కడ ఏం జరుగుతోంది..
Deepthi Sunaina నెటిజన్‌కు దీప్తి సునయన వివరణ..

deepthi sunaina gets trolling
వారంతా ఎలాంటి వారో అర్థం చేసుకోవడానికే నాకు వారం పట్టింది. జాతరలో తప్పిపోయిన పిల్లలాగా మొదటి వారం గడిచింది. నేను కచ్చితంగా ఆటలు ఆడలేదు. కానీ ఎంతో నేర్చుకున్నాను. ఇలాంటి నెగెటివిటీని భరించే శక్తిని పొందాను. ఎంతో బలంగా తయారయ్యాను. షోలో మనిషిని చూసి వారి వ్యక్తిత్వాన్ని నిర్ణయించకండి. నాకు వ్యక్తిగతంగా ఎన్నో గుణపాఠాలు అయ్యాయి.. ఎంతో నెగెటివిటీని భరించి చివరకు ఈ స్థాయికి వచ్చాను. ఇంకా కొన్నిరోజులు నన్ను హాయిగా బతకనివ్వండి’ అని చెప్పుకొచ్చింది.