Deepthi Sunaina Shanmukh : షణ్ముఖ్ నుండి విడిపోయానన్న బాధే లేదు.. దీప్తి సునయన రచ్చ ఏంది ఈ రేంజ్‌లో ఉంది..!
Deepthi Sunaina Shanmukh : యూట్యూబర్ దీప్తి సునయన తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరిచితం. ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొని అశేష ప్రేక్షకాదరణ పొందింది.షణ్ముఖ్‌తో బ్రేకప్ విషయంలో ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది. తన ప్రియుడు షణ్ముఖ్ హౌజ్‌లో ఉన్నప్పుడు దీప్తి సునైనా ఆయన కోసం ప్రత్యేకంగా ప్రచారాలు మొదలుపెట్టింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్ జస్వంత్ కు సంబంధించిన స్పెషల్ వీడియోలను కూడా ఆమె పోస్ట్ చేసింది. అయితే ఏమైందో ఏమో, షణ్ముఖ్ బయటకు వచ్చాక అతనికి బ్రేకప్ ఇచ్చి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. ఆమె చేసే పోస్ట్‌లు, పెట్టే వీడియోలపై నెటిజన్స్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
దీప్తి సునయన ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్టులతో అభిమానుల్లో రకరకాల సందేహాలు నెలకొన్నాయి. ఈ మధ్య ‘కనీసం నీ మనస్సాక్షి చెప్పినట్లు విని నిజాయితీగా ఉండు’ , ‘ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నాకు అనుకూలంగా లేనప్పటకీ నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ‘ ఈ సంవత్సరం నాకేమీ బావున్నట్లు అనిపించలేదు.. కానీ నేను చాలా నేర్చుకున్నాను.. అంటూ వరుస పోస్టులు పెట్టింది సునయన. ఇది చూసిన నెటిజన్లు షణ్ముఖ్ గురించే అలా కామెంట్స్ చేసిందనే అభిప్రాయానికి వచ్చారు.ఎప్పుడు తనదైన శైలిలో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉండే దీప్తి సునయన తాజాగా ఓ హిందీ పాటకు డ్యాన్స్ చేశారు.
deepthi sunaina in full josh in Break up Shanmukh
Deepthi Sunaina Shanmukh : దీప్తి జోష్ మాములుగా లేదుగా..!
ఇందులో దీప్తి సునయన తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేస్తూ అలరిస్తుంది. ఇందులో దీప్తి సునయన జోష్ చూస్తుంటే, అతడితో బ్రేకప్ అయిందనే బాధ కూడా లేనట్టుందిగా అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్ సీజన్2లో సునయన మరో కంటెస్టెంట్ తనీష్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యేది.. మరి అప్పుడు షణ్ము పరిస్థితి ఏంటి అని ఆ ఎపిసోడ్‌ని.. ప్రస్తుత ఎపిసోడ్‌ని కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు.. ఏది ఏమైనా క్యూట్ లవర్స్ షణ్ను, సునయన లవ్ బ్రేకప్ అవ్వకపోతే బావుండని అనుకుంటున్నారు. ఫిబ్రవరి 14న బిగ్ బాస్ వేదికగా ఈ జంట కలవబోతున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. చూడాలి మరి..!
View this post on Instagram