Puri Jagannadh : సినిమా కెరీర్ వర్సెస్ ఛార్మితో స్నేహం… పూరి జగన్నాథ్ ముందు రెండు ఆప్షన్స్
Puri Jagannadh : డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ముందు రెండు ఆప్షన్లు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందులో మొదటిది చార్మితో ఆయన స్నేహం కొనసాగింపు.. రెండవది సినిమా కెరియర్. ఆయన ఈ రెండింటిలో కేవలం ఒక్క దాన్ని మాత్రమే ఇప్పుడు ఎంపిక చేసుకోవాలని ఆయనకు ఇండస్ట్రీ వర్గాల వారు సలహాలు ఇస్తున్నారు. పూరి జగన్నాథ్ ఎప్పుడైతే ఆమె స్నేహంని వదిలి పెడతాడో అప్పుడే ఆయనతో సినిమాలను చేసేందుకు తాము ముందుకొస్తామంటూ పలువురు హీరోలు బాహాటంగానే చెబుతున్నారట. ఆమె ప్రస్తుతం పూరీ సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యవహారాలతో పాటు ఏకంగా కథ మరియు దర్శకత్వ బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తుందట.
అందుకే ఆమె పక్కన ఉండగా పూరితో సినిమా చేసేందుకు ఏ ఒక్క హీరో ఆసక్తి చూపడం లేదంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఆయన ఇప్పటికే చార్మి నుండి దూరం అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నాడు అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. ముంబై ఆఫీస్ మూసివేసి హైదరాబాదు షిఫ్ట్ అవ్వాలని కూడా పూరి జగన్నాథ్ భావిస్తున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరుసగా ఫ్లాప్ పడ్డ కారణంగా పూరి జగన్నాథ్ తన నిర్ణయాన్ని మార్చుకొని హైదరాబాద్ తిరిగి వచ్చి బుద్ధిగా సినిమాలను చేసుకుంటాడేమో చూడాలి.

director Puri Jagannadh has two Choice in front
ఫ్యామిలీకి గత కొన్నాళ్లుగా దూరంగా ఉంటున్న పూరి జగన్నాథ్ మళ్లీ ఫ్యామిలీకి దగ్గర అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయంటూ టాలీవుడ్ ప్రముఖులు చర్చించుకుంటున్నారు. పూరి జగన్నాథ్ లైగర్ సినిమా ఏ స్థాయిలో నిరాశ పరిచిందో అందరికీ తెలిసిందే. అందుకే ఇక నుండి సొంత నిర్మాణంలో సినిమా చేయకూడదనే ఉద్దేశంతో పూరి ఉన్నట్లుగా తెలుస్తోంది. తన నిర్మాణంలో పూరి జగన్నాథ్ కచ్చితంగా చార్మికి భాగస్వామ్యంలో కల్పిస్తాడు. తన నిర్మాణంలో అసలు సినిమాలే రాకుండా చూసుకోవాలని ఆయన భావిస్తున్నాడని కూడా చర్చ జరుగుతుంది. అసలు విషయం ఏంటి అనేది అతి త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే పూరి జగన్నాథ్ ఆ రెండు ఆప్షన్స్ లో ఏదో ఒక ఆప్షన్ ని త్వరలోనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.