Senior heroines : సీనియర్ హీరోయిన్స్ వెంటపడుతున్న దర్శకులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Senior heroines : సీనియర్ హీరోయిన్స్ వెంటపడుతున్న దర్శకులు..!

 Authored By govind | The Telugu News | Updated on :18 May 2021,1:35 pm

Senior heroines : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ నడుస్తోంది. సీనియర్ హీరోయిన్స్‌కు గొప్ప క్యారెక్టర్స్ రాసి ..క్రేజీ ఆఫర్ ఇస్తూ సినిమాకు అడిషనల్ అట్రాక్షన్ ఉండేలా చూస్తున్నారు. ఒకప్పుడు కూడా ఇదే ట్రెండ్ ఉండేది. కానీ అంత పాపులర్ అయ్యేలా తెర మీద కనిపించే వారు కాదు. సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఫేడవుట్ అయిన సీనియర్ హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ అమ్మ, అత్త, అక్క పాత్రలు పోషిస్తున్నారు. వాణీశ్రీ లాంటి వారికి అత్తగా మంచి క్రేజ్ ఉండేది. ఆ తర్వాత అంతటి క్రేజ్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువని చెప్పాలి.

అయితే మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ అత్తారింటికి దారేది సినిమా నుంచి ఈ ట్రెండ్ మొదలు పెట్టాడు. తను తెరకెక్కిస్తున్న సినిమాలలో వీరికి బలమైన పాత్రలు రాస్తున్నారు. అంతే బలంగా తెర మీద చూపిస్తున్నాడు. అత్తారింటికి దారేది సినిమాలో నదియాను నటింపచేసి మంచి క్రేజ్ వచ్చేలా చేశాడు. ఆ తర్వాత అ..ఆ లోనూ నదియాకి మంచి రోల్ ఇచ్చాడు. ఖుష్బూ ను అజ్ఞాతవాసిలో ఇలాంటి రోల్ లో చూపించి క్రేజ్ తీసుకు వచ్చాడు.

Senior heroines

Senior heroines

Senior heroines : టబును అల వైకుంఠపురములో నటింప చేశాడు.

ఇక హాట్ బ్యూటీగా ఒకప్పుడు తెలుగు హిందీ సినిమాలలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న టబును అల వైకుంఠపురములో నటింప చేశాడు. అరవింద సమేతలో దేవయానికి మంచి పాత్ర ఇచ్చాడు. వీరందరికీ ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇలా దర్శకులు సీనియర్ హిరోయిన్స్ తీసుకు రావడానికి ఒకే ఒక కారణం..ఒకప్పుడు వాళ్లంతా గ్లామర్ హీరోయిన్స్‌గా వెలిగి ఉండటమే. అది సినిమాకి బాగా కలిసొచ్చే అంశం అవుతుందన్నదే ప్లాన్. ఇది బాగానే వర్కౌట్ అవుతుంది కూడా. అందుకే మన దర్శకులు ఈ సీనియర్ హీరోయిన్స్ అంటే ఆసక్తి చూపిస్తున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది