Anushka : అందుకు అనుష్క ఒప్పుకోలేదు.. అందుకే ఇలా..
Anushka : అనుష్క.. తెలుగు ఫిల్స్ ఇండస్ట్రీలో ఈ పేరు ఉన్నంత ఫ్యాన్స్ మరెవరికీ ఉండరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుమారు 16 సంవత్సరాల క్రితం అక్కినేని నాగార్జున నటించిన సూపర్ మూవీలో యాక్ట్ చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. వరుస ఆఫర్లతో బిజీ బిజీగా మారింది. దాదాపుగా టాప్, బడా హీరోలతో యాక్ట్ చేసి కొత్త రికార్డు సృష్టించిందనే చెప్పాలి.తెలుగులో చిరు, బాలయ్య, నాగ్, వెంకటేశ్ వంటి సీరియర్ హీరోలతో పాటు మహేశ్ బాబు వంటి యంగ్ హీరోలతో సైతం వరసగా మూవీస్ చేసింది.
తన అందం, అభినయంతో చాలా మంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది స్వీటీ. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియెంటెండ్ మూవీస్‌లోనూ యాక్ట్ చేసి తన సత్తా చాటి తన యాక్టింగ్‌తో స్టార్ యాక్టర్స్‌కు సైతం చెమటలు పట్టించింది అనడంలో ఆశ్చర్యం లేదు. కానీ ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ డల్ అయిపోయింది. బాహుబలి మూవీతో చాలా క్రేజ్ సంపాదించుకున్నా.. ప్రస్తుతం ఎలాంటి ఆఫర్ ఆమెను వరించడం లేదు.దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్న ఈ స్వీటీకి ఇంకా పెళ్లి కాలేదు.

error in anushka horoscope
Anushka : అలాంటివి నమ్మదట
ఆమె వయస్సు ఉన్న హీరోయిన్స్ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. నయనతార సైతం జనవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇందుకు కారణం అనుష్కకు దోషం ఉందట. దోష నివారణ చేస్తే మంచిదని ఆమెకు కొందరు సూచించగా అలాంటివి తాను నమ్మనంటూ చెప్పిందంట అనుష్క. ఆమె లైఫ్‌లో చేసిన పెద్ద తప్పు ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి అనుష్క తీపి కబురు ఎపుడు చెబుతుందో చూడాలి.