Sudigali Sudheer : శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి సుధీర్ ను తొలగించేంత దమ్ము ఈటీవీకి ఉందా?
Sudigali Sudheer : ఈటీవీ ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉంది అంటే ఖచ్చితంగా జబర్దస్త్, ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ మూడు షో లు కూడా ఈ టీవీ ని టాప్ లో నిలుపుతున్నాయి. ఈ టీవీ లో వచ్చే ఏ సీరియల్ కానీ ఇతర షో లు కానీ ఆ చానల్ ని బతికించే పరిస్థితి లేదు. కేవలం జబర్దస్త్ కమెడియన్స్ వల్ల మాత్రమే ఈ టీవీ కొనసాగుతుంది అనే ప్రచారం జరుగుతోంది. ఈసమయంలో ఈ టీవీ యాజమాన్యం ఆ ప్రచారం పై అసంతృప్తితో ఉంది. జబర్దస్త్ కామెడియన్స్ వల్లే ఈటీవీ బతుకుతుంది అంటే వారికి నచ్చడం లేదు. అందుకే ప్రముఖ కమెడియన్స్ అయినా కొందరి ప్రభావంను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎవరు లేకపోతే షో నడవదు అనే ప్రచారం జరుగుతూ ఉంటుందో వారిపై వేటు మెల్ల మెల్లగా వేస్తూ తప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఆ మధ్య డాన్స్ షో ఢీ నుండి సుధీర్ ని తప్పించడానికి కారణం అదే అంటూ ఉంటారు. మెల్ల మెల్లగా జబర్దస్త్ నుండి కూడా ఆయన తప్పిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న సుధీర్ ని కూడా తప్పిస్తారని సమాచారం వస్తుంది. మొత్తానికి ఈ టీవీ వారు సుదీర్ కి వస్తున్న పేరు మరియు ఫేమ్ తో తో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు జోరుగా సాగుతున్న నేపథ్యం లో శ్రీదేవి డ్రామా కంపెనీ మళ్లీ చేతులు మారుతుందని… శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క యాంకర్ సుదీర్ కాకుండా మరెవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో శ్రీదేవి డ్రామా కంపెనీలో కీలకంగా వ్యవహరిస్తున్న రామ్ ప్రసాద్ మరియు ఆది లు కూడా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే సుడిగాలి సుదీర్ ని పక్కకు పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ నడిపించే అంత దమ్ము ఈటీవీ వారికి ఉందా అంటూ సుధీర్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈటీవీ వారు మరియు మల్లెమాల వారు అంత తెలివి తక్కువ వారు కాదు. చాలా స్లో గానే సుధీర్ ని పక్కకు పెట్టే అవకాశాలు ఉన్నాయి. వెంటనే పక్కకు పెట్టు తారు అనుకుంటే పొరపాటు అవుతుంది. ఒకవేళ సుడిగాలి సుధీర్ లేకపోయినా కూడా షో నడుస్తుంది అనే నమ్మకం వచ్చినప్పుడు మాత్రమే వారు పక్కకు పెడతారు కానీ ఆ నమ్మకం కలిగేలా ప్రేక్షకుల్లో కొత్తదనం చూపించేలా మాత్రం ఈ టీవీ మల్లెమాల వారు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఎప్పటికైనా సుదీర్ ని పక్కకు పెట్టి మరో వ్యక్తిని యాంకర్ గా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కాదన్నా సుదీర్ ని ఇంకా నాలుగు ఐదు లేదా పది ఎపిసోడ్లు తర్వాత అయినా కూడా పక్కకు పెడతారనే వార్తలు వస్తున్నాయి.