Jabardasth : వాళ్లు జబర్దస్త్ వీడి నెలలు దాటుతున్న ఇంకా అదే పరిస్థితి
Jabardasth : జబర్దస్త్ కామెడీ షో నుండి సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మరియు జడ్జ్ రోజాలు వెళ్లి పోయి నెలలు గడుస్తున్నాయి. వారు వెళ్లి పోవడంతో ప్రభావం ఉంటుంది.. కాని కొన్నాళ్లలో మళ్లీ అంతా సెట్ అవుతుంది. ఖచ్చితంగా జబర్దస్త్ మునుపటి జోరును అందుకుంటుంది అంటూ ఈటీవీ మరియు మల్లెమాల వారు చెప్పుకొచ్చారు. ఇప్పుడు వారు వెళ్లి పోయి ఇన్నాళ్లు అయినా కూడా జబర్దస్త్ పరిస్థితి మాత్రం మారడం లేదు అంటూ టాక్ మొదలు అయ్యింది. అదుగో ఇదుగో అంటూ జబర్దస్త్ ను హైప్ తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈవారం ఎపిసోడ్స్ కూడా నార్మల్ గానే సాదాసీదాగానే ఉండబోతున్నాయి.
సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ తో పాటు ఇతర ప్రమోషన్ లు బాగానే వస్తున్నాయి. కాని కామెడీ విషయంలోనే గతంతో పోల్చితే చిక్కదనం తగ్గింది. కమెడియన్స్ పూర్తి స్వేచ్చగా షో లో పాల్గొనడం లేదు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే మల్లెమాల వారు మునుపటి మాదిరిగా కమెడియన్స్ తో ఒప్పందాలు కుదుర్చుకుని వారికి సంబంధించిన పారితోషికంను ఫిక్స్ చేయక పోవడం వల్లే వారు కూడా పెద్దగా ఆసక్తిని కనబర్చడం లేదు. హైపర్ ఆది మరియు సుడిగాలి సుధీర్ లు వెళ్లి పోయారు. వారి స్థానంలో కొత్త టీమ్ లు వచ్చాయి.
ఆ కొత్త టీమ్ లకు ఫుల్ గా పారితోషికం ఇవ్వక పోవడంతో పాటు వారి యొక్క ప్రతిభను ఆధారంగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదట. అందరికి కూడా ఒకే తరహా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి అనేది చాలా మంది అభిప్రాయం. అందుకే టీమ్ లీడర్ లు గా కొందరు ఉన్నా కూడా వారికి గౌరవం లేదనే ఉద్దేశ్యంతో బాధ పడుతున్నారు. ఇంతకు ముందు వెళ్లి పోయిన టీమ్ లీడర్ల తరహా లో తమను చూడక పోవడం పట్ల కమెడియన్స్ అసంతృప్తితో ఉన్నారు. అదే కనుక కొసాగితే జబర్దస్త్ నుండి మరింత మంది కనుమరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయి.