ETV Show : ఈటీవీలో డబ్బులు రాకున్న కొనసాగుతున్న షో ఒకే ఒక్కటి ఏంటో తెలుసా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ETV Show : ఈటీవీలో డబ్బులు రాకున్న కొనసాగుతున్న షో ఒకే ఒక్కటి ఏంటో తెలుసా!

 Authored By aruna | The Telugu News | Updated on :15 September 2022,9:30 pm

ETV Show : ఈటీవీ పూర్తిగా షో లపై ఆధారపడి నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీలో వచ్చే సీరియల్స్ ని ఏ ఒక్కరూ చూస్తున్న దాఖలాలు లేవు. ఈటీవీలో ప్రసారం అయ్యే న్యూస్ మరియు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ క్యాష్ ఇంకా పాటల కార్యక్రమం, డాన్స్ కార్యక్రమం తప్ప మరే కార్యక్రమాలకు పెద్దగా ఆదరణ లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సాయికుమార్ వావ్ కార్యక్రమంతో ఈటీవీకి నష్టమే తప్ప లాభం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయికుమార్ తో ఉన్న సుదీర్ఘ కాలపు అనుబంధం కారణంగానే ఈటీవీ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆలీతో సరదాగా టాక్ షో కి కూడా బాగానే రేటింగ్ వస్తుంది, కానీ వావ్ కార్యక్రమానికి మాత్రం అస్సలు రేటింగ్ రావడం లేదని అసలు ఆ కార్యక్రమాన్ని చూసే వాళ్లే లేకుండా పోయారని సమాచారం అందుతుంది.

మరి కొన్నాళ్ల పాటు ఆ కార్యక్రమాన్ని కొనసాగించే ఉద్దేశంతో ఉన్నారట. ఈటీవీ వారు డబ్బులు రాకున్నా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈటీవీలో సీరియల్స్ కూడా అదే పరిస్థితి. డబ్బులు వచ్చే పరిస్థితి లేకున్నా కూడా ఏదో ఒకటి టైం ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతో సీరియల్స్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. అంతే తప్ప ఎక్కడ ఉపయోగ దాయకమైన కంటెంట్ మాత్రం కనిపించడం లేదు. కేవలం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మరో రెండు మూడు కార్యక్రమాలతో మాత్రమే ఈటీవీ రేటింగ్ టాప్ లో ఉంటుంది.

etv sai kumar wow game show rating

etv sai kumar wow game show rating

సీరియల్స్ మరియు వావ్ కార్యక్రమం విషయంలో ఈటీవీ నిర్వాహకులు దృష్టి పెట్టి ఆ టైమ్‌ లో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ అందించే కంటెంట్ ని తీసుకొస్తే తప్పకుండా ఈటీవీ నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉందంటూ బుల్లి తెర వర్గాల వారు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యాపారంలో నష్టం వస్తుంది అంటే ఏదో సెంటిమెంట్ కి వెళ్లి కంటిన్యూ చేయడం కంటే దాన్ని ఆపేయడం మంచిది. కనుక సాయికుమార్ హోస్టింగ్ చేస్తున్న వావ్ కార్యక్రమాన్ని ఇప్పటికైనా నిలిపివేస్తే బాగుంటుంది అనేది ఈటీవీ ప్రేక్షకుల అభిప్రాయం. మరి ఇంకా ఎంత కాలానికి ఆ కార్యక్రమాన్ని ఆపివేస్తారో చూడాలి. చాలా మందికి ఆ కార్యక్రమం వస్తుంది అనే విషయం కూడా తెలియదు.. అలాంటి కార్యక్రమం టెలికాస్ట్ అవసరమా ఆలోచించండి ఈటీవీ యాజమాన్యం గారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది