Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీలోని సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, రామ్ ప్రసాద్ ల్లో ఎవరి పారితోషికం ఎక్కువ?
Sridevi Drama Company : ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లో ప్రధానంగా నలుగురు కనిపిస్తూ ఉంటారు. వారిలో ఒకరు జడ్జి ఇంద్రజ కాగా మరొకరు యాంకర్ సుదీర్. వీరిద్దరి కాకుండా మరో ఇద్దరు కమెడియన్స్ గా ఆది మరియు రామ్ ప్రసాద్ లు కనిపిస్తారు. ఈ నలుగురు షో ని 4 పిల్లర్లుగా నిలబెడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నలుగురు వల్లే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది. ఎంత మంది కమెడియన్స్ ఉన్నా కానీ వారికి వీళ్ళు లీడ్ ఇవ్వాల్సిందే. కామెడీ కోసం వీళ్ల పంచ్ లు ఉపయోగిస్తారు తప్పితే సొంతంగా వారు కామెడీ చేసి ఎంటర్టైన్మెంట్ చేసి షో కి ఇంత క్రేజ్ తెచ్చి పెట్టలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాంప్రసాద్ నటుడిగానే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కి కొన్ని స్కిట్స్ రాయడం కూడా చేస్తాడు. ఈ నలుగురి లో పారితోషికం లెక్క విషయానికి వస్తే ఎవరి లెక్క ఎంత అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నలుగురు మాత్రమే కాకుండా పదుల సంఖ్యలో కంటెస్టెంట్స్ ఉన్నారు. వారందరికీ కూడా పారితోషకాలు భారీగా ఇవ్వాలి అంటే కచ్చితంగా మల్లెమాల వారికి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా వచ్చే లాభాలు ఏమాత్రం సరిపోవు. కనుక భారీ ఎత్తున రెమ్యూనరేషన్లు ఏమి ఇవ్వక పోవచ్చు. షెడ్యూల్ కి 2 లేదా 4 ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తారు. దాని ప్రకారం ప్రకారం పారితోషికం ఇస్తారని సమాచారం అందుతోంది.
చెన్నై నుండి ఇంద్రజ రాను పోను ఖర్చులు మల్లెమాల భరిస్తారు. అంతే కాకుండా ఆమెకు షెడ్యూల్ కి 20 లక్షల చొప్పున పారితోషికం ఇస్తారని తెలుస్తోంది. ఇక ఆది మరియు సుధీర్ కాస్త అటూ ఇటుగా పారితోషికంసమానంగా ఉంటుంది. రాంప్రసాద్ విషయానికి వస్తే ఆయన ఏదైనా స్క్రిప్ట్ ఇస్తే దానికి అదనంగా పారితోషికం ఉంటుందని సమాచారం అందుతోంది. సుడిగాలి సుధీర్ యాంకర్ గా మరియు కమెడియన్ గా కూడా షో లో చేస్తాడు. కనుక అతడికి కాస్త ఎక్కువ పారితోషికం వచ్చే అవకాశం ఉంది అనడంలో సందేహం లేదు. మొత్తానికి ఈ నలుగురికి శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా ప్రతి నెల లక్షలకు లక్షల పారితోషకాలు మాత్రం ముట్టజెబుతున్నారు. మల్లెమాల జబర్దస్త్ కామెడియన్స్ కి కూడా భారీ పారితోషికాలు ఉంటాయనే విషయం తెలిసిందే.