Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ తగ్గింది.. కారణం ఇదేనట! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ తగ్గింది.. కారణం ఇదేనట!

 Authored By aruna | The Telugu News | Updated on :20 August 2022,11:30 am

Sridevi Drama Company : ఈటీవీలో ప్రసారం అవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ రేటింగ్ గడచిన మూడు నాలుగు వారాలుగా బాగా తగ్గినట్లుగా సమాచారం అందుతోంది. అందుకు కారణం ఆదివారం మద్యాహ్నం సమయంలో జీ తెలుగు మరియు స్టార్‌ మా లో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో జబర్దస్త్‌ కి ఏమాత్రం తగ్గకుండా భారీ ఎత్తున రేటింగ్ నమోదు అయ్యేది. కాని ఇప్పుడు మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీకి రేటింగ్ చాలా తక్కువ నమోదు అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

జబర్దస్త్‌ లో సుధీర్ వెళ్లి పోయిన తర్వాత రష్మి యాంకర్‌ గా చేసేందుకు ముందుకు వచ్చింది. సుధీర్ స్థానం ను ఎవరైతే భర్తీ చేయగలరో వారికే ఈ అవకాశం ఇవ్వడంతో రేటింగ్ అప్పుడు ఏమాత్రం తగ్గలేదు. పై పెచ్చు రష్మి యాంకర్ గా చేసిన మొదటి ఎపిసోడ్ కు ఒకింత రేటింగ్ ఎక్కువ వచ్చింది. అలాంటిది ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క రేటింగ్ తగ్గడంతో ఈటీవీ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఏం జరుగబోతుంది అంటూ ఆందోళనతో ఉన్నారు.

etv sridevi drama company rating Gone Down

etv sridevi drama company rating Gone Down

స్టార్‌ మా మరియు జీ తెలుగు లో ప్రసారం అవుతున్న వారం స్పెషల్‌ కార్యక్రమాల వల్ల రేటింగ్ తగ్గింది తప్పితే రెగ్యులర్ రేటింగ్ అలాగే ఉంటుందని.. వచ్చే వారం నుండి మళ్లీ శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క రేటింగ్ కుమ్మేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో శ్రీదేవి డ్రామా కంపెనీకి ఉన్న ఆధరణ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా యూట్యూబ్‌ లో ఈ షో కి వస్తున్న వ్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆది మరియు రామ్‌ ప్రసాద్ ల జోరుకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది