Getup Srinu : నవరసాల్లో కింగ్.. గెటప్ శ్రీను నటనకు అంతా ఫిదా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Getup Srinu : నవరసాల్లో కింగ్.. గెటప్ శ్రీను నటనకు అంతా ఫిదా

 Authored By sandeep | The Telugu News | Updated on :15 March 2022,11:00 am

Getup Srinu : బుల్లితెర‌పై త‌న‌దైన నట‌న‌తో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన న‌టుడు జ‌బ‌ర్ధ‌స్త్ శ్రీను. బుల్లితెర మెగాస్టార్‌గా ఆయ‌న గుర్తింపు పొందాడు. జబర్దస్త్ షోలో గెటప్ శ్రీను వేసే పాత్రలు, చేసే నటన అందరినీ కట్టిపడేస్తుంటుంది. బుల్లితెరపై తన సత్తాను చాటిన శ్రీను.. వెండితెరపై కమెడియన్‌గా దూసుకుపోతోన్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆచార్య వంటి భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తున్నారు. దాదాపు ఇప్పుడు అర డజన్ చిత్రాలతో గెటప్ శ్రీను ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీలోను శ్రీను ప‌లు రోల్స్ చేస్తున్నాడు.తాజా ఎపిసోడ్‌లో ఆయ‌న త‌న న‌ట విశ్వ‌రూపం చూపించాడు.త‌న‌కు సినిమా ఛాన్స్‌లు ఎవ‌రు ఇవ్వ‌ని కార‌ణంగా చాలా బాధ‌ప‌డుతుంటాడు.

ఈ క్ర‌మంలో న‌ట‌న రాద‌న్న వారికి బుద్ది చెప్పేలా న‌వ‌ర‌సాలు చూపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఇందులో శ్రీను న‌ట‌న అమోఘం అనే చెప్పాలి. మెస్మ‌రైజింగ్ న‌ట‌న‌తో అంద‌రిని క‌ట్టిప‌డేశాడు. శ్రీను న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల వర్షం కురుస్తుంది. శ్రీను కెరీర్ ప్రారంభం కాకముందు ఎన్నో కష్టాలు పడ్డారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందు ఊర్లో పొలం పనులు కూడా చేసేవారు. ఏ పని అయినా కూడా కష్టపడి చేసేవారు. ఇదే విషయాన్ని నాగబాబు ఆ మధ్య తన యూట్యూబ్ చానెల్‌లో చెప్పుకొచ్చారు.ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని లక్షలు సంపాదిస్తున్నా.. మొదట అందుకున్న జీతం ఎప్పటికీ గుర్తుండి పోతుంది.

getup srinu performance mind blowing

getup srinu performance mind blowing

Getup Srinu : గెట‌ప్ శీను న‌ట‌న మాములుగా లేదు..

అలా గెటప్ శ్రీను ఆ మ‌ధ్య తన మొదటి జీతం గురించి చెప్పుకొచ్చారు. పొలం పనులకు వెళ్తే 40 రూపాయలు వచ్చేవి అని నిర్మోహమాటంగా చెప్పేవారు. అలాంటి స్థాయి నుంచి గెటప్ శ్రీను ఇప్పుడు స్టార్ సెలెబ్రిటీ వరకు ఎదిగారు. బుల్లితెరపై గెటప్ శ్రీను ఎదురులేనట్టుగా దూసుకుపోతోంటారు. ఆయ‌న ఏ పాత్ర‌లో అయిన ఇట్టే ఒదిగిపోతుంటారు. గెట‌ప్ శ్రీను ఫ్యూచ‌ర్‌లో అద్భుత‌మైన ఆర్టిస్ట్ త‌ప్ప‌క అవుతాడు అని చాలా మంది నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది