గెటప్ శ్రీను భార్య అకౌంట్ హ్యాక్
సోషల్ మీడియా ప్రపంచంలో సెలెబ్రిటీలకు తరుచుగా ఓ సమస్య వెంటాడుతూ ఉంటుంది. వారి సోషల్ మీడియా ఖాతాలు ఎక్కువగా హ్యాకింగ్‌కు గురవుతుంటాయి. అలా తాజాగా గెటప్ శ్రీను భార్య సుజాత అకౌంట్ హ్యాక్ అయిందట. ఈ మధ్య సెలెబ్రిటీలు కొత్త కొత్త వ్యాపారంలోకి దిగుతున్నారు. గెటప్ శ్రీను నటిస్తూ బిజీగా ఉంటే.. ఆయన భార్య కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టేశారు.

Getup Srinu wife Sujatha
జబర్దస్త్ షో వేదిక నుంచి ఎంతో మంది సెలెబ్రిటీలుగా మారారు. కేవలం స్కిట్లు వేసే ఆర్టిస్ట్‌లే కాకుండా వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా జనాల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అలా గెటప్ శ్రీను భార్య సుజాత కూడా ఎన్నో సార్లు తెరపై కనిపించారు. అలా వచ్చిన ఫేమ్‌ను బిజినెస్ కోసం వాడుకుంటున్నారు.
అయితే సుజిశ్రీన్ కలెక్షన్స్ పేరిట ఆమె తన కొత్త అకౌంట్ గురించి చెప్పుకొచ్చారు. పాత అకౌంట్ హ్యాక్ అయిందని, ఎవరో పూర్తిగా ఎడిట్ చేశారని, అందుకే ఈ కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేశాను అని సుజిశ్రీన్ కలెక్షన్ గురించి చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈమె వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
View this post on Instagram