Pawan Kalyan : సినిమాల విషయంలో డల్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ తర్వాత ఆయన నుంచి వచ్చే సినిమా కోసం మెగా అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. భీమ్లా నాయక్ తర్వాత షూటింగ్ కు దూరంగా ఉన్నారు పవన్. అయితే.. భీమ్లా నాయక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాలో పవన్ నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దానితో పాటు మరో సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కావాల్సి ఉంది.
ఈ సినిమాల షూటింగ్ ప్రారంభం కావాలంటే పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది. వినోదాయ సితం అనే మరో సినిమా పవన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సినిమాను సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్యపాత్రలో నటించనున్నారు. అలాగే.. భగత్ సింగ్ సినిమా షూటింగ్ లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సి ఉంది. అయితే.. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాల్లో భాగంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో ఉన్నారు. ఏపీలో పర్యటిస్తున్నారు.

good news to pawan kalyan fans about his movies 2
Pawan Kalyan : హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్న పవన్ కళ్యాణ్
ఏపీ పర్యటన పూర్తి కాగానే.. త్వరలోనే హైదరాబాద్ కు వచ్చి హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటారట. హరిహర వీరమల్లు సినిమా తర్వాత తను ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ అన్నింటినీ వచ్చే ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ లాస్ట్ వీక్ నుంచి పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సెట్ లో అడుగు పెట్టబోతున్నారట. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల వైసీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలు తెలిసిందే. అవి ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.